మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో ప్రముఖ కథానాయిక శ్రీలీల తళుక్కున మెరిసారు. వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సెట్స్ లో స్టార్ హీరోయిన్ శ్రీలీల సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరోయిన్ గా శ్రీలీల వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.
సినిమా సెట్స్ కు వచ్చిన శ్రీలీలకు శంఖాన్ని కానుకగా ఇచ్చారు చిరంజీవి. ఉమెన్స్ డే సందర్భంగా శ్రీలీలకు ఈ గిఫ్ట్ అందించారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది.
శ్రీలీల కూడా తన డ్యాన్స్ టాలెంట్ తో అదరగొట్టేస్తుంది. శ్రీలీల డ్యాన్స్ చేస్తే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే అనేలా అమ్మడు అలరిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల రవితేజతో మాస్ జాతర సినిమా చేస్తుంది. ఐతే చిరంజీవితో శ్రీలీల కనిపించే సరికి విశ్వంభర సినిమాలో శ్రీలీలతో స్పెషల్ సాంగ్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అన్న డిస్కషన్ కూడా మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.
