తాను సంకల్పించిన ఒక కార్యక్రమాన్ని అభిమానులు సంకల్ప బలం తోడై ఇన్నేళ్లుగా ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్త దానం చేస్తున్న దాతలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడటమే కాదు బ్లడ్ బ్యాంక్ నిర్వహణ గురించి ప్రస్తావించారు మెగాస్టార్ చిరంజీవి.
ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకైన నేను ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం మీ ప్రేమ అభిమానమే.నేను చేయగలను అనుకుంటే ఏమైనా చేయగలం.. ఆల్రెడీ ఉన్నారు కదా నేను ఎందుకు అనుకుంటే ప్రత్యేకత ఏముంటుంది. అందుకే నా ప్రత్యేకత చాటాలని వచ్చి డ్యాన్సులు, ఫైట్లు లతో నన్ను నేను చూపించుకున్నా అన్నారు చిరంజీవి.
వరుస సినిమాలు చేస్తున్న టైం లో బ్లడ్ బ్యాంక్ ఆలోచన వచ్చింది. ఐతే ఒకప్పుడు బ్లడ్ ఇవ్వడం అంటే అదేదో పెద్ద తప్పు అన్నట్టుగా చూసే వాళ్లు. కొంతమంది మాత్రమే అది కూడా డబ్బు కోసం బ్లడ్ ఇచ్చే వారు. కానీ తన సంకల్పానికి అభిమానులు తోడై ఇన్నాళ్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కొనసాగుతూ వచ్చిందని అన్నారు. తన కోసం అభిమానులు అంతా పదుల సంఖ్యలో బ్లడ్ డొనేట్ చేశారు.అలాంటి రక్త దాతలను ఇలా సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మళ్లీ మళ్లీ చేయాలని అన్నారు. చరణ్ కూడా కుదిరినప్పుడు ఇక్కడకు వస్తాడని అన్నారు చిరంజీవి.