చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది “క” మూవీ. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. కిరణ్ అబ్బవరం హీరోగా నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్స్ గా చేశారు. సందీప్, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్టుతో రావడంతో ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఈ మూవీకి ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే దిల్ రాజు లాంటి వాళ్లు మూవీకి విషెస్ తెలిపారు.
ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మూవీ టీమ్ కు, కిరణ్ అబ్బవరంకు విషెస్ తెలిపారు. క సినిమాను చూసిన మెగాస్టార్ మూవీ టీమ్ కు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ ఆయనకు స్పెషల్ థాంక్స్ తెలిపారు. మీ ఎంకరేజ్ మెంట్ మాకు చాలా అవసరం అంటూ తెలిపారు. దీపావళి సందర్భంగా త్రిముఖ పోటీలో వచ్చిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి కిరణ్ అబ్బవరంకు భారీ బ్రేక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం చూస్తున్న కిరణ్ కు ఇది పెద్ద ఊరటనిచ్చింది.
దానికి తోడు కిరణ్ చేసిన కొన్ని ఎమోషనల్ కామెంట్స్ కూడా మూవీకి భారీ బజ్ ను తీసుకొచ్చి ఇంత పెద్ద హిట్ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.