VNRTrio: నితిన్(NITHIIN), రష్మిక మందన్న( Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) పాల్గొంటున్నారంటూ చిత్ర బృందం ప్రకటించింది.
నితిన్- రష్మిక- వెంకీ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘భీష్మ(Bheeshma)’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ చిత్రానికి ‘VNRTrio’ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
‘భీష్మ’ చిత్రాన్ని సోషల్ మెసేజ్ కు కామెడీని జోడించి తెరకెక్కించిన తీరుకి వెంకీ ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా రూ. 40 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. వెంకీ తో మరో సినిమా తప్పకుండా చేస్తానని నితిన్ ‘భీష్మ’ చిత్ర ప్రమోషన్ల సమయంలోనే ప్రకటించారు. తాజాగా ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా అధికారికంగా పట్టాలెక్కనుంది. ఈ చిత్రంలోని ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
272193 354088cleaning supplies should have earth friendly organic ingredients so that they do not harm the environment 566712