మెగాస్టార్ చిరంజీవి తన సంపాదనను విలువైన ప్రాపర్టీలు కొనుగోలు చేయడానికి ఇన్వెస్ట్ మెంట్ చేస్తుంటారు. ఇప్పటికే తన సంపాదనను రియల్ ఎస్టేట్ తో పాటు పలు కంపెనీల్లో డిపాజిట్లు చేసిన ఆయన.. కొన్ని బిల్డింగులు కూడా కొనుగోలు చేశారు. ఇప్పటికే ఆయనకు హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగుళూరు లాంటి ప్రధాన నగరాల్లో ఇళ్ళు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఊటీలో కూడా విలువైన ప్రాపర్టీ కొనుగోలు చేశారు. ఊటీ అంటే టూరిస్టులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. నిత్యం అక్కడకు దేశ, విదేశాల నుంచి లక్షల మంది వస్తుంటారు.
సమ్మర్ లాంటి సీజన్లలో అక్కడ సేదదీరడం కోసం సెలబ్రిటీలు ఊటీలో ప్రాపర్టీలను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన చాలా మంది హీరోలకు, దర్శకులకు అక్కడకు ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా ఊటీ ఔట్ స్కర్ట్స్ లోని చుట్టూ టీ గార్డెన్స్ మధ్య మంచి వ్యూ పాయింట్‌లో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు రూ.16 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. ఇక్కడ ఫామ్ హౌజ్ కట్టుకోవడానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నారంట. త్వరలోనే అక్కడ నిర్మాణం మొదలు పెడతారని తెలుస్తోంది.
రామ్ చరణ్, ఉపాసన రీసెంట్ గానే వెళ్లి ఆ వ్యూ పాయింట్ ను చూసి వచ్చారంట. అది చూడటానికి చాలా బాగుండటంతో అక్కడే ఫామ్ హౌజ్ కట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తుందంట మెగా ఫ్యామిలీ. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోందని అంటున్నారు.