Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: యమలోకం కథలో చిరంజీవి వన్ మ్యాన్ షో ‘యముడికి మొగుడు’

1978లో తన తొలి సినిమాలో నటుడిగా పరిచయమైన చిరంజీవి 1988కి సుప్రీం హీరో అయిపోయారు. ఈ పదేళ్లలో డ్యాన్సులు, ఫైట్లతో అశేష ప్రేక్షకాభిమానుల్ని సంపాదించుకుని తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. ఈకోవలో 1988లో చిరంజీవి ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘యముడికి మొగుడు’. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. చిరంజీవి మేనియాతో రాష్ట్రం మొత్తం మార్మోగిపోయింది. ముఖ్యంగా చిరంజీవి తన స్టయిల్, డ్యాన్స్, ఫైట్స్, మేకోవర్ తో సినిమాలో భీభత్సమే చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన యముడితో డ్రామా నేపథ్యంతో తనదైన కామెడీ, మాస్ నటనతో చిరంజీవి ప్రేక్షకాభిమానుల్ని విపరీతంగా అలరించారు.

స్నేహానికి విలువిచ్చిన చిరంజీవి

ఫిలిం ఇనిస్టిట్యూట్ శిక్షణ సమయంలో చిరంజీవి రూమ్ మేట్స్ సుధాకర్, నారాయణరావు, హరిప్రసాద్.. సినీ నటులయ్యారు. చిరంజీవి హీరోగా రేసుగుర్రంలా దూసుకుపోయారు. కానీ.. స్నేహాన్ని మరచిపోలేదు. చిరంజీవి డేట్స్ దొరికితే మహద్భాగ్యం అనుకునే సమయంలో తనతో సినిమా తీయమని తన ముగ్గురు స్నేహితులను ప్రోత్సహించారు. దీంతో వారు ముగ్గురూ కలిసి డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్ స్థాపించి తీసిన సినిమానే ‘యముడికి మొగుడు’. రవిరాజా పినిశెట్టిని దర్శకుడిగా తీసుకున్నారు. రాజ్-కోటిని చిరంజీవి సినిమాకు తొలిసారి సంగీతం అందించేలా చిరంజీవిని నారాయణరావు ఒప్పించారు. రాజ్-కోటి తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తీరు అద్భుతం. పాటలన్నీ మోగిపోయాయి. ధియేటర్లో ‘అందం.. హిందూళం..’ పాటలో చిరంజీవి ఐకానిక్ స్టెప్పులతో రెచ్చిపోయారు. యమలోకంలో పాట, డ్యాన్సులు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: యమలోకం కథలో చిరంజీవి వన్ మ్యాన్ షో ‘యముడికి మొగుడు’

వరుసగా రెండో ఇండస్ట్రీ హిట్

1988 ఏప్రిల్ 29న విడుదలైన ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. చిరంజీవి చేసిన మాస్ కామెడీకి ధియేటర్లు మోతెక్కిపోయాయి. యముడిగా సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య, విచిత్ర గుప్తుడిగా సుత్తివేలు.. చిరంజీవి మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. చిరంజీవికి హీరోయిన్లుగా రాధ-విజయశాంతి బెస్ట్ కాంబో అనిపించారు. 1987లో పసివాడి ప్రాణం సృష్టించిన రికార్డులను తిరగరాసి వరుసగా రెండో ఏడాది రెండో ఇండస్ట్రీ హిట్ సాధించారు చిరంజీవి. స్లాబ్ సిస్టమ్ లో 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని 175 రోజులు ఆడింది. చెన్నై మెరీనా బీచ్ లో అశేష చిరంజీవి అభిమానుల మధ్య శతదినోత్సవ వేడుక నిర్వహించారు. ఇదే సభలో అప్పట్లో వరదల్లో నష్టపోయిన పత్తి రైతుల కుటుంబాలకు చిరంజీవి ఆర్ధికసాయం అందించారు.

మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్స్ – Part 1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

ఆఫ్ట్రాల్ రోజా.! శతకోటి లింగాల్లో బోడి లింగం: రాయపాటి అరుణ

రోజా రెడ్డి అలియాస్ రోజా సెల్వమణి.. సినీ నటి మాత్రమే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. పైగా, ఆమె మంత్రి కూడా. కానీ, ‘ఆఫ్ట్రాల్ రోజా.. శతకోటి లింగాల్లో బోడి లింగం..’...

డిస్నీప్లస్ హాట్ స్టార్ లో “వారియర్” సంచలనం!!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో...

75ఏళ్ల స్వంతంత్ర భారతావని విజయాలు గూగుల్ 2 నిమిషాల వీడియోలో..

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఆగష్టు 15ను ఘనంగా నిర్వహించుకుంటోంది యావత్ దేశం. ఇప్పటికే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది...

బర్త్‌డే స్పెషల్‌ : నీ దూకుడుకు సరిలేరు ఎవ్వరు

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంను పునికి పుచ్చుకున్న మహేష్‌ బాబు చిన్నప్పటి నుండే నటుడిగా వెండి తెర అరంగేట్రం చేశాడు. చిన్న వయసులోనే అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా పేరును దక్కించుకున్నాడు. స్కూల్...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మరి ఈరోజే విడుదలైన ఈ...