Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: బాక్సాఫీస్ బాక్సులు బద్దలకొట్టిన చిరంజీవి ‘రౌడీ అల్లుడు’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

మధ్యతరగతి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్ అయిన చిరంజీవి.. అందుకు పడ్డ శ్రమ, కష్టం, నటనపై ఉన్న మక్కువ, సినిమాపై ఆసక్తి ప్రధాన కారణం. తెరపై చిరంజీవి మాస్ పవర్ చూసేందుకు ఫ్యాన్సే కాదు ప్రేక్షకులు కూడా ఉత్సాహం చూపేవారు. అలా చిరంజీవిలోని మాస్ కోణాన్ని మరోస్థాయిలో ఆవిష్కరించిన సినిమా ‘రౌడీ అల్లుడు’. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో చిరంజీవి దిట్ట. అందుకు ఆయనలో స్వతహాగా ఉన్న కామిక్ టైమింగ్ కూడా ఒక కారణం. రౌడీ అల్లుడులో అదే టైమింగ్ తో సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు. అంతకుముందు చిరంజీవి చేసిన దొంగమొగుడు సినిమా తరహాలోనే కథాంశం, స్క్రీన్ ప్లే, డ్యూయల్ రోల్ ఇదే సినిమాలోనూ ఉన్నాయి. అయినా.. రౌడీ అల్లుడు బ్లాక్ బస్టర్ కావడానికి చిరంజీవి ఇమేజ్, చూపిన వైవిధ్యమే కారణం.

ఆటోజానీగా ఊరమాస్ పాత్రలో..

సినిమాలో ఇండస్ట్రీయలిస్ట్ కల్యాణ్, ఆటోజానీ పాత్రల్లో చిరంజీవి నటించారు. ముఖ్యంగా ఆటోజానీగా చిరంజీవి ఊరమాస్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. ఆయన చేసిన కామెడీకి ధియేటర్లు నవ్వులతో హోరెత్తిపోయాయి. మాసిన గడ్డం, కోర మీసం, బీడీ, ఆటో.. అంటూ చిరంజీవి చాలా ఈజ్ తో పాత్రను పండించారు. కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్యలతో కామెడీ ట్రాక్.. విలన్ కెప్టెన్ రాజుతో.. ‘ఒరేయ్.. నువ్వు డబ్బులు బాగా ఇచ్చుకోవాలి’ అంటూ రఫ్పాడేశారని చెప్పాలి. ఇండస్ట్రియలిస్ట్ కల్యాణ్ గా సాఫ్ట్ పాత్రలో.. ఆటోజానీగా ఎంతో వేరియేషన్ చూపారు. ఇంతగా పాత్రలో జీవించాలంటే స్వతహాగా కామెడీ టైమింగ్, మాస్ టైమింగ్ ఉండాల్సిందే. ముఖ్యంగా సినిమాలో ‘బాక్సు బద్దలైపోద్ది’ అనే చిరంజీవి మేనరిజమ్ రాష్ట్రాన్ని ఊపేసింది. ఇన్నేళ్లయినా ఆ డైలాగ్ ఇప్పటికీ హాట్ ఫేవరేట్. హీరోయిన్ దివ్యభారతి గ్లామర్ తో, శోభన నటనతో ఆకట్టుకుంటారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: బాక్సాఫీస్ బాక్సులు బద్దలకొట్టిన చిరంజీవి ‘రౌడీ అల్లుడు’

కుటుంబం కోసం..

బొంబాయిలో ఆటో ఫైట్ సినిమాకే హైలైట్. ఫైట్స్ లో చిరంజీవి ఎనర్జీని డిఫైన్ చేస్తుంది. సినిమాకు బప్పీలహరి సంగీతం మేజర్ ఎస్సెట్. గ్యాంగ్ లీడర్ తర్వాత రౌడీ అల్లుడులో చార్ట్ బస్టర్ పాటలు ఇవ్వడంతో పాటలన్నీ మోగిపోయాయి. చిలుకా క్షేమమా క్లాస్, బోలో.. బోలో పాట మాస్ బీట్స్ తో అలరిస్తాయి. చిరంజీవి డ్యాన్సులు పాటల్లో బోనస్. సినిమాను ఆయన కుటుంబ సభ్యుల కోసం చేశారు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్ సమర్పణలో సాయిరాం ఆర్ట్స్ బ్యానర్ లో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, పంజా ప్రసాద్ నిర్మాతలుగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా తెరకెక్కించారు. 1991 అక్టోబర్ 18న విడుదలైన రౌడీ అల్లుడు బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. 33 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. సినిమా 100 రోజుల వేడుకలను చెన్నైలో ఘనంగా నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...