Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: స్లో డ్యాన్సులతో ట్రెండ్ సెట్ చేసిన చిరంజీవి ‘కొండవీటి దొంగ’

ఎప్పుడైతే చిరంజీవి స్పీడ్ ఫైట్లు, బ్రేక్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదం అందించారో ప్రేక్షకులు ఆయన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఆశిస్తూనే ఉన్నారు. దశాబ్దాలుగా ఇప్పటికీ అదే కొనసాగుతోంది. అంతగా ఆయన ప్రేక్షకులపై తనదైన ముద్ర వేశారు. డ్యాన్సుల్లో ఎంత వేగం చూపించగలరో, అంతే గ్రేస్ చూపడం ఒక్క చిరంజీవి వల్లే సాధ్యమైంది. పాటల్లో చిరంజీవి చూపే ఎక్స్ ప్రెషన్స్ కు ఎంతో పేరు. రొమాంటిక్ పాటల్లో కూడా తనదైన ఐకానిక్ స్టెప్పులకు చిరంజీవి కేరాఫ్ అడ్రెస్ లా మారారు. బ్రేక్ డ్యాన్సులతో కొత్త ఊపు తీసుకొచ్చిన చిరంజీవి.. స్లో స్టెప్స్ తో అంతే సంచలనాలు నమోదు చేశారు. అలా చేసిన సినిమా ‘కొండవీటి దొంగ’.

స్టెప్పులతో మెస్మరైజ్ చేసిన చిరంజీవి

కొండవీటి దొంగ చిరంజీవికి, ఆయన అభిమానులకు ప్రత్యేకమైన సినిమా. కారణం.. పాటలు, చిరంజీవి డ్యాన్సుల కోసమే అభిమానులు, ప్రేక్షకులు సినిమాను మళ్లీ మళ్లీ చూశారు. ముఖ్యంగా విజయశాంతితో ‘చమక్కు చమక్కు చాం..’ రాధతో ‘శుభలేఖ రాసుకున్నా..’ పాటలు ధియేటర్లో హోరెత్తించాయి. శుభలేఖ పాట పిక్చరైజేషన్, చిరంజీవి హావభావాలు, చిరంజీవి-రాధ జోడి ప్రేక్షకులను చూపు తిప్పుకోనీయలేదు. చమక్కు చమక్కు చాం.. పాట ఏకంగా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అప్పటివరకూ బ్రేక్ డ్యాన్సులతో కనురెప్ప ఆర్పితే స్టెప్ మిస్ అయిపోతామనే వేగంతో ఉన్న చిరంజీవి.. ఈ పాటలో స్లో స్టెప్స్ తో మెస్మరైజ్ చేశారు. కేవలం నడుస్తూ.. తన కదలికలతో డ్యాన్సుల్లో కొత్త ట్రెండ్ సృష్టించారు. పాటలో ఓ చోట.. అలా నడుస్తూ హ్యాండ్ కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుని మళ్లీ జేబులో పెట్టుకుంటూ వేసిన స్టెప్ చిరంజీవికి తప్పితే అంత అందం మరెవరికీ సాధ్యం కాదనే రీతిలో మైమరిపిస్తారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: స్లో డ్యాన్సులతో ట్రెండ్ సెట్ చేసిన చిరంజీవి ‘కొండవీటి దొంగ’

హ్యాట్రిక్ హిట్స్ కి శ్రీకారం..

చిరంజీవితో పలు హిట్స్ తీసిన నిర్మాత టి.త్రివిక్రమరావు తమ విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ లో పై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కొండవీటి దొంగ నిర్మించారు. ఈ సినిమాకు ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కి శ్రీకారం చుట్టారు. యావరేజ్ అంటున్నారని పరుచూరి బ్రదర్స్ తో చిరంజీవి అంటే.. మా మాట నమ్మండి సినిమా సూపర్ హిట్ అన్నారట. అన్నట్టుగానే రెండో రోజు నుంచి సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఇళయరాజా అందించిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. చిరంజీవి మేకోవర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 1990 మార్చి 9న విడుదలైన ఈ సినిమా 36 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని సూపర్ హిట్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

బిగ్ బాస్ తెలుగు: గీతూ రాయల్ ఓవరాక్షన్ వేరే లెవల్.!

‘ఆట రానోళ్ళు కూడా, ఆట గురించి మాట్లాడుతున్నారు..’ అంటూ చలాకీ చంటి మీద గీతూ రాయల్ నోరు పారేసుకుంది. కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన టాస్క్ సందర్భంగా...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: బుధవారం 28 సెప్టెంబర్ 2022

పంచాంగం  శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ తదియ రా.1:50 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ చవితి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: చిత్త ఉ.7:33...

అన్నా చెల్లి… ఇద్దరికీ 15 ఏళ్లు.. తల్లిని చేశాడు

వాళ్ళిద్దరూ వరుసకు అన్నా చెల్లి అవుతారు.. వారి ఇద్దరి వయసు కూడా 15 ఏళ్ల లోపే.. ఇద్దరు కూడా కలిసి పాఠశాలకు వెళ్లి వస్తూ ఉండేవారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ...

ఫోటో మూమెంట్: రామ్ చరణ్ ఇంట సందడి చేసిన భారత క్రికెటర్లు

ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నిన్న మూడో టి20 మ్యాచ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెల్సిందే. లాస్ట్ ఓవర్ వరకూ ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో...

రాశి ఫలాలు: శుక్రవారం 30 సెప్టెంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ పంచమి రా.10:41 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: విశాఖ ఉ.6:22 వరకు...

అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్.

గత సంవత్సరం అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో త్వరలో కొత్త ఫిల్మ్ స్టూడియో -...