Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తుఫాను హోరులో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’

సినిమాల్లో రెగ్యులర్ గా చేసే మాస్, క్లాస్, ఫ్యామిలీ, లవ్, హార్రర్, యాక్షన్, భక్తి, సంగీతం.. సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్టులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కొన్నిసార్లు సక్సెస్ అయితే.. మరికొన్నిసార్లు ప్రయోగాలుగా మిగిలిపోతాయి. ఆ తరహాలో మెగాస్టార్ చిరంజీవి తన అప్రతిహత క్రేజ్ జత చేసి చేసిన సినిమా తిరుగులేని ఇండస్ట్రీ హిట్ గా మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఆ సినిమానే ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. ప్రేక్షకులను కొత్త లోకంలో విహరించేలా చేసిన ఈ సినిమా తెలుగు సినిమాల్లో ఒక అద్భుతం. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిరంజీవి కెరీర్లో ఓ మేలిమి బంగారంలా.. శ్రీదేవి సిగలో ఓ మణిమకుటంలా నిలిచిపోయింది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తుఫాను హోరులో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’

భారీ హంగులతో అద్భుతం..

కథలోని భారీతనానికి తగ్గ స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం, కళ.. అద్భుతమైన టెక్నీషియన్స్ తోడైతే దక్కే అపురూప విజయమే ఈ సినిమాకు దక్కింది. అప్పటివరకూ ఉన్న ఫాంటసీ కథలకు భిన్నంగా చిరంజీవి సూచన మేరకు ఓ దేవకన్య భూమి మీదకు వచ్చేలా కథ డిజైన్ చేయమని చెప్పడంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇంతటి భారీ స్కేల్ సినిమా బాధ్యతను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుపై పెట్టారు చిరంజీవి. సాక్షాత్తూ దేవకన్యే దివి నుంచి దిగివచ్చిన్నట్టు హీరోయిన్ శ్రీదేవి మరిపించారు. అమ్రీష్ పూరి విలనిజం సినిమా గ్రాండియర్ పెంచింది. ఇళయరాజా సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం. అబ్బనీ తియ్యనీ దెబ్బ పాటకు తెరపై డబ్బులే విసిరారు. మానస సరోవరం సెట్ వేసి ప్రేక్షకులు నిజంగా అక్కడికి వెళ్లామనే అనుభూతి కల్పించారు. అజయ్ విన్సెంట్ కెమెరా పనితనం అద్భుతం.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తుఫాను హోరులో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’

చిరంజీవి కోసం ఓసారి.. శ్రీదవి కోసం మరోసారి..

దర్శకుడు రాఘవేంద్రరావు తన మాయాజాలంతో సినిమాను క్లాసిక్ చేశారు. జంధ్యాల రాసిన ‘మానవా.. అని శ్రీదేవి.. ఆ పిలుపు మానవా..’ అని చిరంజీవి డైలాగులు అలరించాయి. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా చిరంజీవికి వరుసగా నాలుగో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సినిమా రిలీజైనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భీకర తుఫాను అల్లకల్లోలం చేస్తోంది. రెండు రోజులు సినిమా ఆపేసినా ఐదో రోజు నుంచి ధియేటర్ల వద్ద క్యూలు పెరిగిపోయాయి. తుఫానులో కూడా కలెక్షన్ల తుఫాను సృష్టించిన సినిమాగా నిలిచింది. 46 కేంద్రాల్లో 100, విజయవాడ అప్సర ధియేటర్లో 200, షిఫ్టులతో 365 రోజులు ఆడింది. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో అనిల్ కపూర్ ముఖ్య అతిధిగా శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు. చిరంజీవి కోసం ఓసారి, శ్రీదేవి కోసం ఓసారి.. సినిమా కోసం మరోసారి చూడాలనే ప్రశంస మర్చిపోలేనిదని కె.రాఘవేంద్రరావు పేర్కొనడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

బిగ్ బాస్ తెలుగు: గీతూ రాయల్ ఓవరాక్షన్ వేరే లెవల్.!

‘ఆట రానోళ్ళు కూడా, ఆట గురించి మాట్లాడుతున్నారు..’ అంటూ చలాకీ చంటి మీద గీతూ రాయల్ నోరు పారేసుకుంది. కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన టాస్క్ సందర్భంగా...

పిక్ టాక్: ఎత్నిక్ వేర్ లో గ్లామర్ ఒలకబోస్తోన్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు యువతని కట్టిపడేస్తూ ఉంటుంది. కెరీర్ లో పదిహేనేళ్ళు పైగా పూర్తి చేసుకున్నా కానీ ఇంకా అవకాశాలకు...

ఎదురు చూపులకు తెర.. ‘ఆదిపురుష్’ వచ్చేశాడు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 2వ...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

మహేష్ బాబు సినిమాలో మోహన్ బాబు?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేష్ 28వ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలవ్వగా అప్పుడే ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది....

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

జనసేనాని పవన్ కళ్యాణ్‌కి అండగా చిరంజీవి నిలబడతారా.?

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పని చేశారు. మరి, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి చిరంజీవి ఎందుకు కనీసం మద్దతివ్వలేదు.? 2019 ఎన్నికల్లో చిరంజీవి రాజకీయంగా...

ఆ ఐదు నిమిషాల పని వైసీపీకి ఎందుకు చేతకావట్లేదు.?

‘యాత్రను అడ్డుకోవడమెంత పని.? ఐదు నిమిషాలు చాలు..’ అంటున్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యానారాయణ. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్మార్గుడిగా ఇదే బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. ఇప్పుడు...

పవన్ జల్సాను దాటడం చెన్నకేశవరెడ్డికి సాధ్యమా..?

హీరో మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఆగష్టు 9న పోకిరి స్పెషల్ షోస్ వేసి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. దీంతో చిరంజీవి పుట్టినరోజున ఘరానామొగుడు, పవన్ కల్యాణ్ పుట్టినరోజున తమ్ముడు,...