స్టార్ హీరో సినిమా షూటింగ్ ప్రారంభమై, విడుదలయ్యే వరకూ పరిశ్రమ, ట్రేడ్, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానుల అంచనాలు ఆకాశమే హద్దుగా ఉంటాయి. హిట్ కాంబో అయితే ఇది డబుల్. ఇన్ని అంచనాలున్న సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. అదీ చిరంజీవి సినిమా అయితే.. ఇక ప్రభంజనమే. అంతటి అద్భుతాన్ని చేసిన చిరంజీవి సినిమా ఇంద్ర. . ‘ఇదీ.. చిరంజీవి సినిమా అంటే.. ఇవీ.. రికార్డులంటే’ అంటూ సినిమా సాధించిన వసూళ్లు, నిర్మాత నుంచి థియేటర్లో సైకిల్ స్టాండ్ ఓనర్ వరకూ వచ్చిన లాభాలు అమోఘం. చేసిన ఓకే ఒక్క రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాను తన మాస్, యాక్షన్, డైలాగులు, డ్యాన్సులు కలబోసి విందు భోజనమే అందించారు చిరంజీవి. దీంతో ఆయన కెరీర్లో మరచిపోలేని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇంద్ర.
తెరపై శివ తాండవమే..
సినిమాలో శంకర నారాయణ, ఇంద్రసేనా రెడ్డి పాత్రల్లో శివ తాండవమే చేశారు చిరంజీవి. సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగులు డైనమెట్లు పేలినట్టు ఉంటాయి. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలోంచుకు వెళ్తున్నా.. లేదంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని.. అనే డైలాగ్.. అక్కడ ఫైట్ లేకున్నా 100 మందితో చిరంజీవి ఫైట్ చేసినట్టు ఉంటుంది. అక్కడ చిరంజీవి హావభావాలు, స్క్రీన్ ప్లే. అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా’ డైలాగ్ మోత మోగిపోయింది. దాయి దాయి దామ్మ.. పాటలో చిరంజీవి వేసిన ఐకానిక్ వీణ స్టెప్ ఓ అద్భుతం. చిరంజీవి అంటే వీణ స్టెప్.. వీణ స్టెప్ అంటే చిరంజీవి. మణిశర్మ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ తమ గ్లామర్ తో అలరించారు.
అదే సెంటిమెంట్ కంటిన్యూ..
వైజయంతీ మూవీస్ పై చిరంజీవి-అశ్వనీదత్ కాంబోలో జగదేకవీరుడు అతిలోక సుందరి.. తుఫాను సమయంలో, చూడాలని ఉంది.. వర్షాల్లో విడుదలై హిట్ అయినట్టు.. ఇంద్రకూ సెంటిమెంట్ కొనసాగింది. అప్పటి వరకూ, ఆ తర్వాత కొన్నాళ్లు ఎండలతో అల్లాడిన రాష్ట్రం.. ఇంద్ర విడుదల రోజు మాత్రం వర్షం పడటం.. సినిమా అద్భుతాలు చేయడం జరిగింది. టిక్కెట్ దొరికితే లాటరీ అన్నట్టు.. జంగారెడ్డిగూడెంలో ఒక అభిమాని బ్లాకులో బంగారపు ఉంగరం ఇచ్చి టికెట్ కొని సినిమా చూడటం విశేషం. 122 కేంద్రాల్లో 100, 32 కేంద్రాల్లో 175 రోజులు, 35 కోట్లకు పైగా వసూళ్లతో ఇంద్ర ప్రభంజనం కొనసాగింది. విజయవాడలోని విశాలమైన మైదానంలో జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకలు అభిమానులతో కిక్కిరిసిపోయి.. మైదానం చాలని పరిస్థితి ఏర్పడింది. చిరంజీవి వన్ మ్యాన్ షోకి అచ్చమైన నిదర్శనం ఇంద్ర.
A movie tv ro ravatm ledu
403186 638764This really is a great topic to speak about. Sometimes I fav stuff like this on Redit. This post probably wont do nicely with that crowd. I will probably be certain to submit something else though. 647235