Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తెలుగు సినిమా చరిత్రలో తొలి 10కోట్ల షేర్.. చిరంజీవి ‘ఘరానామొగుడు’

మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ హీరోగా బాక్సాఫీసు రికార్డుల్ని ఎన్నోసార్లు తిరగరాశారు. ముఖ్యంగా 1987 నుంచి 1992 వరుసగా 6ఏళ్లపాటు ప్రతిఏటా ఒక్కో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తన ఇమేజ్ మాత్రమే కాదు.. తెలుగు సినిమాను కమర్షియల్ గా భారతీయ సినీ పరిశ్రమలో నిలబెట్టారు. అలా చిరంజీవి సాధించిన మరో భారీ ఇండస్ట్రీ హిట్ ‘ఘరానామొగుడు’. ఈ సినిమా సృష్టించిన రికార్డులకు బాలీవుడ్ సైతం ఉలిక్కిపడింది. రీజనల్ సినిమా సాధించిన అద్భుతానికి బాలీవుడ్ ఫిలిం మ్యాగజైన్లు సైతం చిరంజీవి ముఖచిత్రంగా బాక్సాఫీస్ మనీ మిషన్ అని కీర్తించాయి. ఈ విజయంతో దేశంలోనే తొలిసారిగా 1.25 కోట్లు పారితోషికం తీసుకున్న హీరోగా కీర్తికెక్కారు. దీంతో ‘ది వీక్’ మ్యాగజైన్ చిరంజీవి ముఖచిత్రంతో ‘బిగ్గర్ దేన్ బచ్చన్’ అని ప్రత్యేక ఆర్టికల్ తో చిరంజీవి సృష్టించిన ప్రభంజనాన్ని దేశానికి చాటింది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తెలుగు సినిమా చరిత్రలో తొలి 10కోట్ల షేర్.. చిరంజీవి ఘరానామొగుడు

భారీ మార్పులు..

సినిమాకు మూలం కన్నడ సినిమా. తమిళంలో రజినీకాంత్ తో కన్నడ వెర్షన్ యధాతధంగా తెరకెక్కిస్తే.. తెలుగులో చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్ భారీ మార్పులు చేశారు. గయ్యాళి భార్యను బుద్ధి చెప్తూ, కార్మికుల సమస్యలు తీరుస్తూ, తల్లిని సంతోషపెట్టే కొడుకుగా చిరంజీవి పాత్ర ఉంటుంది. ఫస్ట్ ఫైట్, ఫస్ట్ సాంగ్ తోనే సినిమా ఓ రేంజ్ కి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకూ సినిమా స్థాయి అంతకంతకూ పెరిగి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. చిరంజీవి మాస్ డైలాగ్స్, మేనరిజమ్స్, ఫైట్స్, డాన్స్, కామెడీ సినిమాను పరుగులు పెట్టిస్తుంది. ఫ్యాక్టరీ ఎండీ, గయ్యాళి భార్యగా నగ్మా నటన చిరంజీవితో పోటీ పడుతుంది. వాణివిశ్వనాధ్ ముఖ్య పాత్రలో నటించింది. తెలుగు వెర్షన్ చూసిన రజినీకాంత్.. ‘ఈ సినిమాను మళ్లీ నేను తమిళ్లో రీమేక్ చేసుకోవచ్చు’ అనేంతగా చిరంజీవి పాత్రను, స్క్రీన్ ప్లే, కథలో మార్పులు చేశారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తెలుగు సినిమా చరిత్రలో తొలి 10కోట్ల షేర్.. చిరంజీవి ఘరానామొగుడు

తెలుగు సినిమాకు కొత్త లెక్కలు..

ఎన్టీఆర్, చిరంజీవితోనే సినిమాలు తీస్తానని ప్రకటించిన నిర్మాత కె.దేవీవరప్రసాద్ తమ దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా నిర్మించారు. కీరవాణి సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. ‘బంగారు కోడిపెట్ట..’ పాటలో చిరంజీవి డ్యాన్సులకు ఫ్యాన్స్ ఊగిపోయారు. చిరంజీవి మేనరిజమ్ ‘ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో..’ మోగిపోయింది. చిరంజీవి సింగిల్ హ్యాండ్ తో నమస్తే పెట్టడం ట్రెండ్ సెట్టర్ అయింది. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఘరానామొగుడు కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పటికి 60ఏళ్ల తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలిసారి 10కోట్ల షేర్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. 56 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై మొత్తంగా 175 రోజులు ఆడింది. గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో నిర్వహించిన శతదినోత్సవ వేడుకలకు వచ్చిన చిరంజీవి అభిమానులతో నగరం స్తంభించిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

బిగ్ బాస్ తెలుగు: గీతూ రాయల్ ఓవరాక్షన్ వేరే లెవల్.!

‘ఆట రానోళ్ళు కూడా, ఆట గురించి మాట్లాడుతున్నారు..’ అంటూ చలాకీ చంటి మీద గీతూ రాయల్ నోరు పారేసుకుంది. కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన టాస్క్ సందర్భంగా...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

‘మెగా’ పోటీ నుండి తప్పుకున్న మంచు విష్ణు

కెరీర్ లో చాలా కాలం గ్యాప్ తర్వాత మంచు విష్ణు నుండి వస్తోన్న నెక్స్ట్ సినిమా జిన్నా. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. టీజర్ కు మంచి...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సరస్వతి దేవిని అర్చించారు....

నేనే వస్తున్నా మూవీ రివ్యూ – సెకండ్ హాఫ్ సిండ్రోమ్

ధనుష్, సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అంటే తమిళనాట అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వారి నుండి వచ్చిన సినిమాలు అలాంటివి. ఇక సెల్వ రాఘవన్ నుండి తెలుగులో...

రాశి ఫలాలు: శుక్రవారం 30 సెప్టెంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ పంచమి రా.10:41 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: విశాఖ ఉ.6:22 వరకు...

బిగ్‌ బాస్ 6 శ్రీ సత్య గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తెలుగు అమ్మాయి క్యూట్ ముద్దుగుమ్మ శ్రీ సత్య. హౌస్ లో కి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే తనకు...