Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి ఇమేజ్ ను ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లిన ‘గ్యాంగ్ లీడర్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

‘మెగాస్టార్’ అనేది చాలా పెద్ద ట్యాగ్. చిరంజీవి అభిమానులే కాదు, ప్రేక్షకులు, విమర్శకులు, ట్రేడ్, పరిశ్రమ మొత్తం చెప్పే మాట. చిరంజీవి తన కష్టంతో, సినిమాపై ఇష్టంతో సాధించిన ఆభరణమే మెగాస్టార్. డైనమిక్ హీరో, సుప్రీం హీరో ట్యాగ్స్ తర్వాత మెగాస్టార్ గా చిరంజీవిని తొలిసారి మరణమృదంగం సినిమాలో ఈ ట్యాగ్ వేశారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చినా.. మెగాస్టార్ హోదా, నెంబర్ వన్ హీరోగా చిరంజీవికి తిరుగులేని స్థానం కల్పించిన సినిమా మాత్రం ‘గ్యాంగ్ లీడర్’ అని చెప్పాలి. చిరంజీవి కెరీర్లో ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఆయన అభిమానులకు హాట్ ఫేవరేట్. మాస్ సినిమాకు సరైన అర్ధం. కమర్షియల్ సక్సెస్ కు సరైన నిదర్శనం. గ్యాంగ్ లీడర్ గా చిరంజీవి సృష్టించిన ప్రభంజనం, సాధించిన ఇమేజ్ ఎంత చెప్పుకున్నా తక్కువే.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి ఇమేజ్ ను ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లిన ‘గ్యాంగ్ లీడర్’

చిరంజీవి రిజెక్ట్ చేసిన కథ..

ముగ్గురు అన్నదమ్ములు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కంటెంట్ ఉన్న కథ ఓ ప్రభంజనం సృష్టిస్తుందని మొదట చిరంజీవి భావించలేదు. కథను చిరంజీవి తిరస్కరించారని.. కథపై నమ్మకం ఉందని పరుచూరి సోదరులతో నిర్మాత చెప్పారు. మూడు రోజులు సమయం తీసుకుని మళ్లీ కథను రీడిజైన్ చేసి చిరంజీవికి చెప్తే జరిగిన అద్భుతమే గ్యాంగ్ లీడర్. సినిమాలో చిరంజీవి మాస్ మూల విరాట్ అవతారమే ఎత్తారు. నున్నటి గెడ్డం, చురకత్తి చూపులు, డ్రెస్సింగ్, మేకోవర్.. గ్యాంగ్ లీడర్ గా చిరంజీవిని చాలా రఫ్ గా చూపాయి. ‘చెయ్ చూడు.. ఎంత రఫ్ గా ఉందో.. రఫ్పాడించేస్తాను’ డైలాగ్ మోగిపోయింది. ఒక్కో రౌడీకీ ఒక్క దెబ్బ మాత్రమే కొట్టే ఫైట్, లారీడు రౌడీల్ని కొట్టే సన్నివేశం, క్లైమాక్స్ ఫైట్స్ ఫ్యాన్స్ కు పూనకాలే తెప్పించాయి.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి ఇమేజ్ ను ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లిన ‘గ్యాంగ్ లీడర్’

మాస్ కు సరైన నిర్వచనం..

సినిమాకు ప్రాణం అంటే బప్పీలహరి సంగీతం. పాటలన్నీ ఆంధ్రప్రదేశ్ ను హోరెత్తించాయి. టైటిల్ సాంగ్ లో చిరంజీవి స్టెప్పులకు ఫ్యాన్స్ ఊగిపోయారు. విజయశాంతితో కామెడీ సన్నివేశాలు, పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇంటర్వెల్ లో చిరంజీవి గోడను బద్దలకొట్టే సీన్ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ ను ప్రతిబింబిస్తుంది. ఫ్రెండ్స్ చనిపోయాక చిరంజీవి రెచ్చిపోయి నటించారని చెప్పాలి. మొత్తంగా చిరంజీవి అసలు సిసలు వన్ మ్యాన్ షో గ్యాంగ్ లీడర్. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నిర్మాణంలో విజయబాపినీడు దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్ 55 కేంద్రాలో 100 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సినిమా శతదినోత్సవ వేడుక తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ సంచలనం. చిరంజీవి పుట్టినరోజున జరిపిన వేడుకలు ఒకే రోజున నాలుగు కేంద్రాల్లో (హైదరాబాద్, తిరుపతి, ఏలూరు, విజయవాడ) నిర్వహించడం ఇప్పటికీ.. ఎప్పటికీ చెరిగిపోని రికార్డుగా మిగిలిపోయింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...