మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆయన్నుంచి ఎప్పటికప్పుడు ఆశించింది.. కొత్తగా ఫైట్లు, డ్యాన్సులు, కామెడీనే. ఆ జోనర్ దాటి నటనకు అవకాశమున్న పాత్రలు, కథలు కూడా చిరంజీవి ఎన్నుకుని ప్రేక్షకులను మెప్పించారు. అలా అద్భుతమైన కథ, చిరంజీవి నట విశ్వరూపం చూపించిన సినిమాల్లో ‘ఆపద్భాంధవుడు’కు ప్రత్యేక స్థానం ఉంది. ఘరానామొగుడు వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత 100శాతం క్లాస్ టచ్ ఉన్న ఈ సినిమా కథ, కథనం, చిరంజీవి నటన, దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వ ప్రతిభ అద్భుతమని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కళాత్మకమైన సినిమా చిరంజీవికి కమర్షియల్ సక్సెస్ ఇవ్వకపోయినా ఆయన కెరీర్లో మంచి సినిమాగా నిలిచింది.
పరమశివుడిగా మెప్పించి..
అనాధగా ఉన్న చిరంజీవిని ఓ కుటుంబం ఆశ్రయమిస్తే.. అదే కుటుంబానికి ఆపత్కాలంలో ఆదుకునే ఆపద్భాంధవుడుగా చిరంజీవి పాత్ర ఉంటుంది. గోవులుకాసే మాధవగా, పౌరాణిక నాటకాల్లో శివుడి పాత్రధారిగా, తనకు ఆశ్రయమిచ్చిన కుటుంబ యజమానికి సాయం చేసే పాత్రల్లో చిరంజీవి నటన అత్యద్భుతం. చిరంజీవికి కవితలు అంకితం ఇచ్చే సమయంలో, నది దాటి వచ్చి గోదావరి మట్టితో శివుడి ప్రతిమ చేసిన సమయంలో చిరంజీవి నటన అద్భుతం. మానసిక చికిత్సాలయంలో బాధితులతో కలిసిపోయి మానసిక వైకల్యం ఉన్నట్టు చిరంజీవి నటించిన తీరు ప్రేక్షకులే కాదు.. విమర్శకుల ప్రశంసలు దక్కించింది. ఉభయగోదావరి జిల్లాల్లో శివుడి పాత్రధారిగా నిన్ను మించినవారు లేరన్నప్పుడు చిరంజీవి హావభావాలు ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. శివుడిగా చిరంజీవి మెప్పించారు. పార్వతీ పరమేశ్వరులుగా హీరోయిన్ మీనాక్షి శేషాద్రి, చిరంజీవి నాట్యం సినిమాకే హైలైట్ గా నిలిచాయి.
ఉత్తమ హీరోగా నంది అవార్డు..
పూర్ణోదయా క్రియేషన్స్ పై కె.విశ్వనాధ్ దర్శకత్వంలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఈ సినిమా నిర్మించారు. కీలకపాత్రలో దర్శక, రచయిత జంధ్యాల నటించారు. 1992 అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా కళాత్మక చిత్రంగా నిలిచింది. ఆపద్భాంధవుడు సినిమాలో చిరంజీవి నటన.. భవిష్యత్ తరాల నటులకు ఓ లైబ్రరీ’ అని దర్శకుడు కె.విశ్వనాధ్ చెప్పడం విశేషం. అంతగా ఆయన నటనలో పరకాయ ప్రవేశం చేశారు. సినిమాకు ఆ ఏడాది 5 ప్రభుత్వ నంది అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. చిరంజీవికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. ఉత్తమ సినిమాల్లో తృతీయ చిత్రంగా నంది అవార్డు దక్కించుకుంది. కీరవాణి సంగీతంలో పాటలన్నీ వీనులవిందుగా నిలిచాయి. చిరంజీవి-కె.విశ్వనాధ్ కలయికలో వచ్చిన ఆపద్భాంధవుడు వారి కెరీర్లో క్లాసిక్ గా నిలిచింది.
34263 946895An really interesting examine, I may well not agree completely, but you do make some extremely legitimate factors. 881534