Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిన్నారులను సైతం మెగాభిమానులుగా మలచుకున్న చిరంజీవి

91,316FansLike
57,007FollowersFollow

చిరంజీవి 44 ఏళ్ల లాంగ్ సినీ కెరీర్లో 152 సినిమాల అనుభవం ఉంది. ఇన్నేళ్లలో ఆయన దాదాపు ప్రతి జోనర్లో సినిమాలు చేశారు. చిరంజీవి ప్రస్థానం మొదలయ్యేసరికి పౌరాణిక, జానపద సినిమాల ట్రెండ్ అయిపోయింది. దీంతో ఆయనే కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. డ్యాన్స్, ఫైట్లలో కొత్త ఒరవడి తీసుకొచ్చి అప్పటి తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాల మధ్య కొత్త దారి వేసుకుని ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు చిరంజీవి. ఈక్రమంలో రొటీన్ కథలైనా తన మార్క్ చూపించి ప్రత్యేకత చాటుకున్నారు. కొత్త కథలతో తెలుగు సినిమాను పరుగులెత్తించారు. దీంతో అప్పటి సినీ అభిమానులు చిరంజీవి ఆదరిస్తే.. చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లు చూసి చిన్నారులు సంబరపడిపోయేవారు. అలా.. ఆయన్ను 80, 90 దశకాల్లో అభిమానించిన చిన్నారులే ఇప్పుడు పెద్దవారై మెగా ఫ్యాన్స్ లో భాగమయ్యారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిన్నారులను సైతం మెగాభిమానులుగా మలచుకున్న చిరంజీవి

చిన్నారులంటే అభిమానం..

నిజ జీవితంలో చిరంజీవికి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. తన కుటుంబంలోని చిన్నారులతో కలిసి ప్రతి ఆదివారం తన ఇంట్లో, షూటింగ్ విరామ సమయంలో కూడా ఆటలు ఆడుతూ వారిలో హుషారు నింపేవారు. చంటబ్బాయి సినిమాలో చిరంజీవి చిన్నపిల్లాడిలా చేసిన కామెడీకి చిన్నారులు ఫిదా అయిపోయారు. చిరంజీవి చేసిన పసివాడి ప్రాణం సినిమా చిన్నారులను అప్పట్లోనే వీరాభిమానులను చేసింది.

చిరంజీవిని తమ ఇంట్లో వ్యక్తిగా తమ గుండెల్లో పెట్టుకున్నారు. ప్రతి సినిమాలో డ్యాన్స్, ఫైట్స్, కామెడీతో చిన్నారులను ఆకట్టుకుని వారి మనసుల్లో సుస్ధిర స్థానం సంపాదించారు. ముఠామేస్త్రిలోని ఓ పాటలో బ్యాట్ మ్యాన్, రాబిన్ హుడ్.. పాత్రలతో చిన్నారులను ఆకట్టుకున్నారు. చిన్నారులను సంతోషపెట్టేందుకు హనుమాన్ మూవీలో ఆంజనేయుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. హ్యాండ్సప్ మూవీ క్లైమాక్స్ ఫైట్లో టాకిండ్ డాల్ వెంట్రిలాక్విజమ్ తో ఆకట్టుకున్నారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిన్నారులను సైతం మెగాభిమానులుగా మలచుకున్న చిరంజీవి

చిన్నారుల చుట్టూ కథలు..

చిరంజీవిని చిన్నారులకు మరింత దగ్గర చేసిన సినిమాగా జగదేకవీరుడు అతిలోకసుందరి నిలిచింది. కథ మానవ శక్తి, దైవశక్తికి మధ్య ఉన్నా.. చిన్నారుల చుట్టూ కథ ఉంటుంది. నలుగురు చిన్నారులు సినిమాలో ముఖ్యపాత్ర పోషించడంతో ఆ సినిమా చిన్న పిల్లలను బాగా ఆకట్టుకుంది. బేబి షామిలి వైద్యం కోసం హిమాలయాలకు వెళ్లిన చిరంజీవి క్షేమంగా ఉండాలని పాడే ‘జై చిరంజీవా..’ పాట నిజంగా చిరంజీవి కోసమే అన్నట్టుగా చిన్నారులు లీనమైపోయారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిన్నారులను సైతం మెగాభిమానులుగా మలచుకున్న చిరంజీవి

తర్వాత చిరంజీవి ఏ సినిమా చేసినా అభిమానంలో వారి పాత్ర ప్రముఖ పాత్ర పోషించింది. మృగరాజు, డాడీ, అంజి, జై చిరంజీవి సినిమాల్లో కూడా చిన్నారుల చుట్టూ కథ, సెంటిమెంట్ అంశాలతో నేటి తరం చిన్నారులనూ ఆకట్టుకున్నారు. చిరంజీవిపై అభిమానమే ఆయాన కుటుంబ హీరోలకు మెగా ఫ్యాన్స్ పెట్టని కోట అయ్యారు. చిన్నారుల అభిమానమే చిరంజీవికి ‘శ్రీరామరక్ష’గా నిలిచిందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం...

రాజకీయం

అమరావతిపై సుప్రీం.! ఇంతకీ షాక్ ఎవరికి.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి...

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఏర్పాట్లు పూర్తయ్యాక ఆపుతారా..? సభకు వెళ్తా.. ఎలా ఆపుతారో చూస్తా..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్...

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

ఎక్కువ చదివినవి

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు....

రాశి ఫలాలు: మంగళవారం 29 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ షష్ఠి మ.3:46 వరకు తదుపరి సప్తమి సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం) నక్షత్రము: శ్రవణం మ.1:46 వరకు...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం – బిలో యావరేజ్ రియలిస్టిక్ డ్రామా

నాంది చిత్రంతో సీరియస్ రియలిస్టిక్ డ్రామాతో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్ మరోసారి అలాంటి జోనర్ కు చెందిన చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రోమోలతో ఇదేదో సీరియస్, హార్డ్ హిట్టింగ్ చిత్రంలా అనిపించిన...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా నటించిన ‘బేధియా’ ప్రమోషన్లో భాగంగా వరుణ్...