Chiranjeevi: మెగా న్యూస్..! త్వరలో ‘చిరంజీవి పోడ్ కాస్ట్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,223FansLike
57,764FollowersFollow

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓ మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా..? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దశాబ్దాలుగా భారీ ఫ్యాన్ బేస్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమాభిమానాలు ఆయన సొంతం. జనరేషన్ మారినా మెగాస్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదంటే అన్ని వర్గాల్లో ఆయన సంపాదించుకున్న క్రేజ్ ఇందుకు నిదర్శనం. ఇప్పుడు Gen Z ని కూడా తన సినిమాలతో అలరిస్తూ పాత-కొత్త తరాలకు వారధిలా నిలుస్తున్నారు. ఈక్రమంలో ఫ్యాన్స్, ప్రేక్షకులతోపాటు Gen Z ని ఆకట్టుకునేందుకు త్వరలో ఓ ‘పోడ్ క్యాస్ట్’ కార్యక్రమంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

ఈ పోడ్ క్యాస్ట్ ద్వారా చిరంజీవి తన జీవితానుభవాలు, సినీ ప్రయాణం, ఫ్యాన్స్, ప్రేక్షకాదరణ, సినిమాలు, ఫ్యామిలీ తదితర వివరాలను పంచుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికీ ఎందరో ప్రముఖులు ‘చిరంజీవి తమకు ఆదర్శమని.. ఆయన్ను ఇన్ స్పిరేషన్ గా తీసుకునే సినిమాల్లోకి వచ్చా’మని చెప్తారు. ఇందుకు కారణాలు కూడా ఆయన పోడ్ క్యాస్ట్ లో పంచుకుంటారని.. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా తన జీవితపు సక్సెస్ విషయాలను కూడా పంచుకుంటారని తెలుస్తోంది. దీనిని దర్శకుడు, రచయిత బీ.వీ.ఎస్.రవి పర్యవేక్షణలో తెరకెక్కుతుందని తెలుస్తోంది.

నిజానికి చిరంజీవికి ఈ ఆలోచన ఉందని ఆయన కుమార్తె సుస్మిత గతంలోనే చెప్పినప్పటికీ ఎప్పటినుంచో క్లారిటీ లేదు. ఇప్పుడు దీనిపై ప్రీ-ప్రొడక్షన్ జరుగుతోందని, త్వరలోనే ఈ కార్యక్రమ వివరాలను వెల్లడిస్తారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ‘చిరంజీవి పోడ్ క్యాస్ట్’ ను తీర్చిదిద్దేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కార్యక్రమం ప్రారంభమైతే మెగా క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. బీ.వీ.ఎస్.రవి ప్రస్తుతం చిరంజీవి సినిమాకు రచయితగా పని చేస్తున్నట్టు సమాచారం.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

అల్లూరి ఆశయాలే దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో అల్లూరి...

ఎక్కువ చదివినవి

పంచాయతీరాజ్‌ను ప్రజల సమస్యలకు పవర్‌హౌస్‌గా మార్చాలి: పవన్ కళ్యాణ్

గ్రామ పంచాయతీలు ప్రజల సమస్యలను పైస్థాయికి పంపించే వ్యవస్థగా కాకుండా, వాటికి అక్కడికక్కడే పరిష్కారాలు చూపే "పవర్‌హౌస్"లుగా మారాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan...

అల్లూరి ఆశయాలే దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో అల్లూరి...

హైదరాబాద్‌లో బీఫ్‌ను మటన్‌గా విక్రయం..? ఇద్దరు అరెస్ట్.. 50 కిలోల మాంసం స్వాధీనం

హైదరాబాద్‌లో ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్‌ను మటన్‌గా కలిపి నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో...

Daily Horoscope: కర్కాటకం వారికి శుభవార్తలు.. ధనుస్సు వారికి కొత్త అవకాశాలు

జులై 2 , 2026 గురువారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా జులై 2, 2026 గురువారం నాటి రాశిఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, విద్య మరియు...

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్..! అఖిల్ కష్టంపై నాగ చైతన్య స్పందన

Lenin: అక్కినేని ఇంటి మూడో తరం హీరోల్లో ఒకరు అఖిల్. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇప్పటికే తెరంగేట్రం చేసిన అఖిల్ పలు సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హీరోగా...