మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెర మీద కనపడితే మెగా ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. వారు స్టెప్పేసినా, డైలాగ్ చెప్పినా, ఫైట్ చేసినా.. ధియేటర్ల టాప్ లేచిపోవాల్సిందే. అటువంటిది ఏమీ లేకుండానే వారం రోజుల తేడాలో మెగా ఫ్యాన్స్ లో 1000 ఓల్టుల ఎనర్జీ తెప్పించారు చిరంజీవి-రామ్ చరణ్. ఇటివల గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు సాధిస్తే.. వారం రోజుల గ్యాప్ లో తనయుడు రామ్ చరణ్ తేజ్ ఎన్డీటీవీ “ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా” అవార్డు సాధించడమే ఇందుకు కారణం.
ఇద్దరూ ఇద్దరే..
తండ్రీ, తనయుడు సాధించిన కీర్తితో మెగాభిమానులకు పూనకాలే వస్తున్నాయి. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. మెగా ఫ్యాన్స్ మేము.. అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. తెలుగు సినిమా కమర్షియల్ రేంజ్ ను చిరంజీవి ఏనాడో పెంచారు. ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో ఒక హీరోగా మరో మెట్టు ఎక్కించారు. రామ్ చరణ్ కు ఇప్పుడు జాతీయస్థాయిలో క్రేజ్ ఉంది. అందుకు అనుగుణంగానే ఈ అవార్డు లభించింది. రేసులో ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, సోనూ సూద్, తాప్సీలను వెనక్కునెట్టి రామ్ చరణ్ అవార్డు సాధించినట్టు తెలుస్తోంది.
పుత్రోత్సాహంలో చిరంజీవి..
తనయుడు సాధించిన కీర్తిని చూసి మెగాస్టార్ చిరంజీవి పొంగిపోతున్నారు. ఈమేరకు ట్విట్టర్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక పోస్టు చేశారు. ‘నాన్నా.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డు సాధించడం నాకు ఎంతో సంతోషంగానూ.. గర్వంగా కూడా ఉంది. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. మీ అమ్మా, నాన్న’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ మరింత జోష్ లో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Like Father.. Like Son.. జై చిరంజీవ.. అంటూ మెసేజెస్ చేస్తున్నారు.
Nanna,
Absolutely thrilled for you and proud, on winning the #TrueLegend – #FutureOfYoungIndia Award #NDTV
Bravo!!! 👏👏 Way to go, dearest @AlwaysRamcharan– Appa & Amma pic.twitter.com/6t1wJuvzxy
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 2, 2022