గేమ్ ఛేంజర్ నిరాశపరచిందని డల్ గా ఉన్న మెగా ఫ్యాన్స్ కి రెట్టింపు ఉత్సహాన్ని తెచ్చేలా అనూహ్యంగా ఆరెంజ్ రీ రిలీజ్ జరిగింది. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా కూడా మొదటిసారి రిలీజైన టైంలో సరిగా ఆడలేదు. ఆ సినిమాలోని సాంగ్స్ ఇంకా ఆ కాన్సెప్ట్ ఇప్పుడు జనాలకు ఎక్కింది. అందుకే అదొక క్లాసిక్ అని ఇప్పుడు అంటున్నారు. ఇప్పటికే ఆరెంజ్ ఒకసారి రీ రిలీజ్ అవగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక రీసెంట్ గా మరోసారి ఆ సినిమా రీ రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా పోయిందన్న బాధలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఆరెంజ్ సినిమా మీద ఒక రేంజ్ లో ప్రేమను చూపించారు. ఆరెంజ్ రీ రిలీజ్ రెండోసారి అయినా కూడా మెగా ఫ్యాన్స్ సందడితో ఆ రీ రిలీజ్ థియేటర్లు అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి.
ఇక థియేటర్ లో మెగా ఫ్యాన్స్ హంగామా ఐతే నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది. ఆరెంజ్ రీ రిలీజ్ హంగామాతో సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. మెగా ఫ్యాన్స్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ హడావిడి చూస్తే అర్ధమవుతుంది. ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ సినిమా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కూడా సంతోషంగా ఉన్నారు. ఆరెంజ్ థియేటర్లు అన్నీ మ్యూజిక్ కన్సర్ట్ లుగా మారాయని ఆయన చెప్పడం విశేషం. గేమ్ ఛేంజర్ తో చేయాలనుకున్న సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఆరెంజ్ రీ రిలీజ్ థియేటర్స్ లో చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.