Mega Family: ముగ్గురూ మెగా హీరోలే.. మూలాలు మర్చిపోని రియల్ హీరోలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,254FansLike
57,764FollowersFollow

Mega Family: ఏ రంగంలో ఉన్నామన్నది కాదు.. ఎంత విజయం సాధించామన్నది కాదు.. ఏస్థాయి గుర్తింపు తెచ్చుకున్నామన్నది కాదు. మన ప్రవర్తన, నడవడిక, ఇచ్చే గౌరవం, ఒద్దిక ఎంతన్నదే అసలైన విజయం, గుర్తింపు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మెగా ఫ్యామిలీ. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్. ఒక కుటుంబం నుంచి వచ్చి తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారు. ఒక్కడిగా అంత పెద్ద పరిశ్రమలోకి వచ్చి చిరంజీవిగా అడుగుపెట్టి ఒక్కో విజయం సాధిస్తూ మెగాస్టార్ అనే కీర్తి కిరీటం దక్కించుకున్నా.. ఇప్పటికీ ఆయనది సామాన్యుడి మనస్తత్వం.. అదే వినయం. అందుకే.. నేటికీ సినిమాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ చిరంజీవి అంటే చెప్పేది ఇన్ స్పిరేషన్ అనే. ఎలా ఎదగాలో నేర్పిన వ్యక్తి.

పవన్ కల్యాణ్.. విభిన్నమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆడంబరాలకు దూరం. పుస్తక పఠనం ఇష్టం. సమాజానికి సేవ చేయాలనే ధృఢ సంకల్పం. అయినా.. ఏం చేయాలో తెలీని పరిస్థితి నుంచి చిరంజీవి తమ్ముడిగా హీరో ఎంట్రీ ఇచ్చి తనదైన సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నారు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసిన వ్యక్తి. తానేం చేయగలనో పూర్తి స్పష్టత ఉన్న వ్యక్తి. తనతోటి హీరోలు ఇమేజ్ కాపాడుకుంటూ.. ఇంకా పెంచుకుంటుంటే పవన్ కు అవేమీ పట్టవు. సమాజం, ప్రజలు. ఆ రంగంలోనే పయనించారు. జనసేన పెట్టారు. 10ఏళ్లు పోరాడారు.. నేడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఎక్కడ తగ్గాలో తెలుసుకుని ఆయన సాధించిన విజయం ఓ పాఠం.

రామ్ చరణ్.. తెలుగు సినిమాను దశాబ్దాలుగా నెంబర్ వన్ హీరోగా ఏలేసిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు. తనకేం కావాలో అవన్నీ వచ్చేస్తాయి. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. అయినా.. ఆయనెప్పుడూ తండ్రి మెగాస్టార్ హోదా చూసి ప్రవర్తించలేదు. చిరంజీవి కొడుకుగానే నిరాడంబరంగా, ఉన్నత విలువలతో పెరిగారు. తండ్రి అండతో హీరో అయ్యారు. కానీ.. తానేం చేయగలనో నిరూపించి ప్రేక్షకుల్ని మెప్పించారు. స్టార్ హీరో అయిపోయారు. చిరంజీవి కొడుకు.. అనే స్థాయి నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనేస్థాయికి వెళ్లి తండ్రి గర్వపడేలా చేశారు. అయినా.. ఆయనలో కానరాని గర్వం. సింప్లిసిటీకే ఆయన ప్రాధాన్యం. దైవ చింతన ఎక్కువ. ఎదుటివారికి గౌరవం ఇవ్వడంలో రాజీలేని మనస్తత్వం.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఇంత పెద్ద పరిశ్రమ ఎందరికో ఉపాధిని ఇస్తోంది. మెగా ఫ్యామిలీగా వీరి పాత్రా ఎక్కువే. కానీ.. అంతా మేమే, మావల్లే ఇదంతా అనేట్టు ఏనాడూ ప్రవర్తించలేదు. ఒకటి రెండు హిట్లు రాగానే నేనే అంతా అనేట్టూ బిహేవ్ చేయలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నారు. విమర్శలు వస్తే స్వీకరించారు. అపజయాలు వస్తే తట్టుకున్నారు. మరో విజయం కోసం కష్టపడ్డారు. చిరంజీవి.. తాను పెరిగిన మధ్యతరగతి మూలాలు మరువలేదు. పవన్ కల్యాణ్.. అన్న చూపిన దారిని మర్చిపోలేదు. రామ్ చరణ్.. అంత పెద్ద కుటుంబమైనా ఉన్నత విలువలతో పెంచిన చిరంజీవి పెంపకాన్నీ మర్చిపోలేదు. ముగ్గురూ చేసే పని సినిమాల్లో హీరోగా. కానీ.. నిజజీవితంలో సామాన్యులుగా జీవితం.

సినిమా

‘డ్యూ డేట్’ ఘనంగా ప్రారంభం.. కోర్ట్‌రూమ్ డ్రామాపై ఆసక్తి

తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ నిర్మిస్తున్న తొలి చిత్రం 'డ్యూ డేట్' ఘనంగా ప్రారంభమైంది. పవన్ తరిగోపులతో...

PM Modi: ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్ హోతా హై’...

PM Modi: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కాజోల్, రాణీ ముఖర్జీ జంటగా 1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాను సినీ...

ఫౌజీ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఆగస్టులో మేకింగ్ వీడియో!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ' నుంచి అభిమానులకు త్వరలో ఓ ప్రత్యేక సర్‌ప్రైజ్ రానుంది. ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం,...

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

రాజకీయం

ఏపీలో హ్వాసంగ్ మెగా క్లస్టర్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియాలోని బుసాన్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రముఖ హ్వాసంగ్ గ్రూప్ (Hwaseung Group) ఉన్నతస్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫుట్‌వేర్, ఫుట్‌వేర్ మెటీరియల్స్, ఆటోమోటివ్...

నల్లమలలో బయటపడిన అమరావతి చరిత్ర.. పవన్ కళ్యాణ్ హర్షం

నల్లమల అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఓ చారిత్రక శాసనం అమరావతి చరిత్రపై కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో ఈ...

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

ఎక్కువ చదివినవి

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు ప్లాన్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో...

E20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు.. అసలు వివాదమేంటి?

భారత్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్‌తో కూడిన ఈ20 (E20) ఇంధనాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి ముందుగానే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ నిర్ణయంపై పలు ప్రాంతాల్లో వ్యతిరేకత...

ఏపీ ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల జోరు.. లోకేష్ సంస్కరణలతో పెరుగుతున్న నమ్మకం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు సంస్కరణలు ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. ముఖ్యంగా...