మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాతా మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు, అలాగే ‘మంచు’ వర్గంగా చెప్పబడుతోన్న నరేష్ సహా మరికొందరు, మెగా కాంపౌండ్‌కి వ్యతిరేకంగా నానా రకాల వ్యాఖ్యలూ చేశారు, చేస్తూనే వున్నారు.
‘నన్ను పోటీలోంచి తప్పుకోమని చిరంజీవి చెప్పారు..’ అంటూ విష్ణు చెప్పడం చూశాం. అయితే, ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయమై స్పందించలేదు. మౌనం అర్థాంగీకారం అనుకోవాలా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు మాత్రమే ఇప్పటిదాకా ‘మా’ ఎన్నికల వ్యవహారం గురించి మాట్లాడుతూ వచ్చారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, నిహారిక.. ఇలా మెగా కాంపౌండ్ నుంచి చాలామందే వున్నారు. కానీ, అంతా సంయమనం పాటిస్తున్నారు. మంచు కాంపౌండ్ మీద విమర్శలు చేయాల్సి వస్తే, మెగా కాంపౌండ్‌లో ఎవరికీ అది పెద్ద విషయమే కాదు.
చిరంజీవి మీద గతంలో మోహన్ బాబు సెటైర్లేసినప్పుడు, దాసరి హద్దులుదాటి మాట్లాడినప్పుడూ.. సందర్భానుసారం.. అటు పవన్ కళ్యాణ్, ఇటు రామ్ చరణ్ ధీటైన సమాధానాలిచ్చిన విషయాన్ని ఎలా మర్చిపోగలం. ప్రస్తుతం మెగా కాంపౌండ్‌లో చర్చ జరుగుతోందట.. మెగా కాంపౌండ్‌ని టార్గెట్ చేయాల్సిన అవసరం ‘మంచు వర్గానికి’ ఏమొచ్చిందనేదే ఆ చర్చ తాలూకు సారాంశం.
సరైన సమాధానం ఇవ్వాల్సిందేనంటూ చిరంజీవిపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే, ఎవరూ మాట్లాడొద్దని చిరంజీవి ఆదేశించారట. దాంతో, అంతా సంయమనం పాటిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ సమాధానమివ్వాల్సి వస్తే.. అది ఏ స్థాయిలో వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, స్పందించడం అనవసరం.. అన్న అభిప్రాయమే మెగా కాంపౌండ్‌లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
కానీ, అట్నుంచి ఆరోపణలు, వెటకారాలు ఎక్కువైపోతోంటే, ఖచ్చితంగా కౌంటర్ ఎటాక్ వచ్చి తీరుతుంది. అదెప్పుడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
406365 269762Beging with the entire wales effectively before just about any planking. Our own wales can easily compilation of calculated forums those thickness analysts could be the comparable to some of the shell planking along with more significant damage so that they project soon after dark planking. planking 448811
212311 23373Hello! Someone in my Facebook group shared this site with us so I came to look it over. Im surely enjoying the details. Im book-marking and will be tweeting this to my followers! Outstanding weblog and superb style and style. 444936
486890 770852Aw, it was a really very good post. In concept I should put in writing related to this moreover – spending time and actual effort to manufacture a excellent article but exactly what do I say I procrastinate alot and no means discover a method to go carried out. 582508
711112 564223To your organization online business owner, releasing an critical company could be the bread so butter inside of their opportunity, and choosing a great child care company often indicates the certain between a victorious operation this is. how to start a daycare 487563
921641 304060Some times its a discomfort within the ass to read what individuals wrote but this internet website is very user friendly ! . 559904