మెగాస్టార్ చిరంజీవి ఆగస్ట్ 22న తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా అభిమానుల కోసం భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ఒక ప్రెస్ మీట్ లో తెలిపాడు మెగా బ్రదర్ నాగబాబు. “ప్రతీసారి శిల్పకళా వేదికలో ఒక ఈవెంట్ ను నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఇన్నేళ్ళుగా మాకు అండగా ఉన్న అభిమానుల కోసం భారీ ఈవెంట్ ను నిర్వహించాలని భావించాం. హైదరాబాద్ లోని హైటెక్స్ లో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఈవెంట్ సాగుతుంది. అభిమానుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం” అని తెలిపాడు.
అలాగే ఈ కార్నివాల్ కు మెగా హీరోలు అందరూ వస్తారని, వారితో పాటు చిరంజీవిని అభిమానించే ఇతర హీరోలు, ప్రముఖులు కూడా హాజరవుతారని తెలిపాడు నాగబాబు. ఇదే ఈవెంట్ లో ఎవ్వరికీ చిరంజీవి గురించి తెలీని ఒక విషయం కూడా చెబుతానని అన్నాడు నాగబాబు.