Switch to English

మెగా బ్రేకింగ్‌: సోషల్‌ మీడియాలోకి మెగాస్టార్‌ చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియాలోకి ‘మెగా’ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఇటీవల పలు విషయాలపై ఆయన స్పందిస్తూ, ప్రెస్‌ నోట్స్‌ విడుదల చేయడం, వీడియోలు విడుదల చేయడం చూస్తున్నాం. అయితే, తన భావాల్ని, తన అనుభవాల్నీ అభిమానులతో పంచుకునేందుకు సోషల్‌ మీడియాని సరైన వేదికగా భావిస్తున్నాననీ, ఈ క్రమంలోనే తాను సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా చిరంజీవి సోషల్‌ మీడియాలో హ్యాండిల్స్‌ తెరవనుండడం గమనార్హం.

ఇదిలా వుంటే, మెగాస్టార్‌ సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇస్తే, ఆయనపై ప్రశ్నల వర్షం కురవడం ఖాయం అభిమానుల నుంచి. ఓ వైపు రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు, ఇంకో వైపు సినీ రంగానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చి పడతాయి. ప్రస్తుత తరుణంలో సోషల్‌ మీడియాలో కొనసాగడమంటే చిన్న విషయమేమీ కాదు. అభిమానుల పేరుతో కొందరు దురభిమానుల వెకిలి చేష్టల్నీ తట్టుకోగలగాలి. మరి, వాటన్నిటికీ చిరంజీవి సిద్ధమేనా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అన్నట్టు, కరోనా వైరస్‌పై అవగాహన కల్పించే క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పటికే పలు వీడియోల్ని విడుదల చేశారు. ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి కూడా.

ఏదిఏమైనా, రేపు సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చే చిరంజీవి నుంచి తొలి పోస్ట్‌ ఎలా వుంటుంది.? ఏ అంశాన్ని ఉద్దేశించి వుండబోతోంది.? ఇదిప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో బహుశా దానిపైనే మెగాస్టార్‌ తొలి పోస్ట్‌ వుండే అవకాశముంది. అదే సమయంలో, ఉగాది సందర్భంగా విషెస్‌ తెలపడానికే తొలి పోస్ట్‌ పరిమితం చేయొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: టిక్ టాక్ వీడియో కారణంగా గొర్రెల కాపరి అరెస్ట్

అనంతపురం జిల్లాలో అటవీ శాక అధికారులు గొర్రెలు కాసుకునే నాగార్జునను అరెస్ట్ చేశారు. అతడు వన్య ప్రాణులను ఇబ్బంది పెడుతూ టిక్ టాక్ వీడియోను చేశాడు. పలు వీడియో లు సోషల్ మీడియాలో...

గడిపింది బాయ్ ఫ్రెండ్ తో.. గర్భానికి కారణమని డెలివరీ బాయ్ పై కేసు

ఇదో విచిత్రమైన కేసు. చైనాకు చెందిన ఓ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపింది. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే, అందుకు కారణం డెలివరీ బాయ్ అని, అతడు ఎనిమిది...

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.? మీరు అనుకున్నది కరెక్టే కానీ తెలుగు...

క్రైమ్ న్యూస్: ప్రియురాలిని ఎర వేసి చెల్లి ప్రియుడిని చంపేసిన..

తన చెల్లిని ప్రేమించాడు అంటూ 19 యేళ్ల దినేశ్‌ను వంశీ చంపేశాడు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ సంఘటన జరిగింది. హరీష్‌ పేటకు చెందిన దినేశ్‌ కొన్నాళ్లుగా సంధ్యను ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ...

మూడు లాంతర్ల స్తంభం కూల్చివేతపై టీడీపీ నిరసన

విజయనగరం నిన్న రాత్రి అధికారులు కూల్చి వేసిన మూడు లాంతర్ల స్తంభం ఘటన పట్టణంలో తీవ్ర అలజడి రేపుతోంది. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్తంభాన్ని కూల్చి వేయడం తగదనే...