Anudeep: మారుతున్న కాలాన్ని బట్టి కామెడీ పద్దతులు కూడా మారిపోతున్నాయి. సున్నిత హాస్యంతో ప్రజల్ని నవ్వించే రోజుల నుంచి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిత్వహననం చేస్తూనో, వారి వ్యక్తిగత విషయాలను ఎగతాళి చేస్తూనో చేసే వెర్రి చేష్టలు ఇప్పుడు కామెడీ అయ్యాయి. ఇలాంటి మానసిక రుగ్మతతో బాధపడే వ్యక్తులు చేసే కామెడీని ఎదురు కూర్చుని చూస్తూ వెకిలి నవ్వులు నవ్వే వారిది కూడా తప్పే. వీరి వ్యక్తిగత తీరు గురించి ఎదుటివారు కామెడీగా చెప్తేనో.. వీరిని ఎగతాళి చేస్తేనో , వీరి ఇళ్లళ్ళోని తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్య పిల్లలను ఎగతాళి, హేళన చేస్తేనో.. పబ్లిగ్గా కామెడీ చేస్తే వీరు ఊరుకుంటరా? కోపం రాదా? ఇప్పుడదే కోపం మెగాభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులకు వచ్చింది. స్టాండప్ కమెడియన్ గా చెలామణీ అవుతున్న ఓ బఫూన్.. అనుదీప్ అనే వ్యక్తిపై.
ఇటివలి ఓ స్టాండప్ కమెడియన్ షోలో అనుదీప్ అనే బఫూన్ క్యారెక్టర్ కమెడియన్ రామ్ చరణ్, పవన్ కల్యాణ్, నిహారిక వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ కామెడీ చేశాడు. తనను తక్కువ చేసుకునో ఓ విషయంపై తనదైన శైలిలో చెప్పి నవ్విస్తే అది కామెడీ అవుతుంది కానీ.. ఎదుటి వారి జీవితాల్ని చులకన చేస్తూ మాట్లాడితే అదేం కామెడీనో అతనికే అర్ధం కావాలి. దీనిని వ్యతిరేకించకపోయినా పర్లేదు.. నవ్వుతూ శునకానందం పొందుతున్న తోటి కమెడియన్స్ ది శాడిజమే అనాలి. అనుదీప్ కు మెగా ఫ్యామిలీకి సంబంధం లేకపోయినా చులకన చేసాడు. ఇటువంటి కుసంస్కారులతో నేటి సమాజం వర్ధిల్లుతోంది. అభిమాన హీరోలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అభిమానులు వెళ్లి గొడవ చేస్తే ఎదురు కేసులు. అభిమాన హీరోపై చవకబారు కామెంట్స్ చేసే ఇటువంటి చౌకబారు వ్యక్తులపై ఎలా చేయాలో అదే చేసేందుకు సిద్ధమయ్యారు మెగా హీరోల ఫ్యాన్స్.
అనుదీప్ అడ్రస్ కనుగొని కూడా ఫ్యాన్స్ సంయమనం పాటిస్తున్నారు. ఉవ్వెత్తున వెళ్లి అనుదీప్ తో రామ్ చరణ్ కు క్షమాపణ చెప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. లీగల్ గానే అప్రోచ్ అయ్యి.. టార్గెటెడ్ గా చేసిన వెకిలి కామెడీ వెనుక ఎవరైనా ఉన్నారా..? వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసారా? అనేదానిపై లీగల్ గా వెళ్లేందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేన శ్రేణుల నుంచి కూడా అనుదీప్ పై గట్టి వ్యతిరేకత వస్తోంది. ఎందుకింత అహంకారం అంటూ ఆ పొగరు అణచేసేలా మెగా, వవర్ ఫ్యాన్స్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే లీగల్ చర్యలు తప్పవని పంచకర్ల సందీప్ ఎక్స్ వేదికగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకరిపై కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడాలన్నా భయపడేలా అనుదీప్ లాంటి కుసంస్కారులను అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది.
