పవన్ కళ్యాణ్ సరసన ‘బంగారం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీరా చోప్రా గుర్తుందా.? ఆ మీరా చోప్రానే నితిన్‌తో కలిసి ‘మారో’ అనే సినిమాలోనూ నటించింది. కానీ, రెండు సినిమాలూ తెలుగులో ఆమెకు నిరాశనే మిగిల్చాయి. తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది ఈ చోప్రా గర్ల్. అయితే, సౌత్ సినిమా తనకు అస్సలు కలిసి రాలేదంటూ ముంబైకి చెక్కేసింది. ‘ప్రియాంకా చోప్రా కజిన్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టుకుని, అక్కడ అవకాశాలు కోసం నానా తంటాలూ పడ్తోంది.
ఇక, అసలు విషయంలోకి వస్తే, సౌత్ సినిమా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మీరా చోప్రా. ‘సౌత్ సినిమాల్లో నటిస్తే డబ్బులొస్తాయేమోగానీ, జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ రాదు..’ అంటూ మీరా చోప్రా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజానికి, ‘మారో’ సినిమా టైమ్‌లో నిర్మాతల్ని దారుణంగా ఏడిపించింది మీరా చోప్రా. రెమ్యునరేషన్ విషయంలో ఆమె చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ఆమె కారణంగా ఆ సినిమా నిర్మాణంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి.
Also Read: రమ్య సాంగ్ లో హీటెక్కిస్తానంటున్న రకుల్ ?
అదేంటోగానీ, సౌత్ సినిమాలతో పాపులర్ అయి, బాలీవుడ్‌కి వెళ్ళే భామల్లో కొందరు, సౌత్ సినిమా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. రాధికా ఆప్టే, తాప్సీ ఆ కోవలోకే వస్తారు. తెలుగు సినిమాల్లో హాట్ హాట్‌గా కన్పించి పాపులర్ అయిన తాప్సీ, బాలీవుడ్‌కి వెళ్ళాక ‘సౌత్‌లో ఎక్స్‌పోజింగ్‌కి తప్ప నటనకు అవకాశమే లేదు.. ఇష్టం లేకపోయినా ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వచ్చింది సౌత్ సినిమాల్లో’ అనడం, ఆ వ్యాఖ్యలు పెను దుమారం రేపడం, చివరికి తాప్సీ క్షమాపణ చెప్పడం జరిగాయనుకోండి.. అది వేరే సంగతి.
రాధికా ఆప్టే అయితే ఓ స్టార్ హీరో తనను వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆమె ఆ హీరో ఎవరన్నది ఇప్పటికీ వెల్లడించలేదు. ఇక, మీరా చోప్రా ‘సెక్షన్ 375’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్‌లో ఆమె ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం, బాలీవుడ్ జనాల్ని మెప్పించే క్రమంలో సౌత్ సినిమాని తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు సబబు.?
