మీనాక్షి చౌదరి ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఎందుకంటే ఆమె నటించిన లక్కీ భాస్కర్ చాలా పెద్ద హిట్ అయింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఆమె ఎక్కువగా గ్లామర్ పాత్రలు మాత్రమే చేసింది. కానీ ఇందులో మొదటిసారి ఆమెకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. దాంతో ఆమె నటనకు మంచి ఆదరణ దక్కుతోంది. దీంతో ఆమె ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సక్సెస్ తో ఆమెకు టాలీవుడ్ లో మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
మరి ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత ప్రమోషన్లు చేయకుండా ఆగుతుందా.. అందుకు తగ్గట్టే ఆమె ప్రమోషన్స్ లో జోరు పెంచుతోంది. పైగా తెలుగు ఆడియెన్స్ కు దుల్కర్ కంటే ఆమెనే ఎక్కువ పరిచయం కాబట్టి మరింతగా దూసుకుపోతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా దుమ్మురేపే ఫొటోషూట్లు కూడా చేస్తోంది. తాజాగా ఆమె బ్లూ టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో ఆమె అందాల మెరుపులు మెరిపిస్తోంది. ఇంత గ్లామర్ ను చూపించాక అవి వైరల్ కాకుండా ఉంటాయా.. ఆటోమేటిక్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ ఫొటోలు చూసిన వారంతా.. పర్ ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫొటోలను చూసేయండి.