Switch to English

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్ ఇస్తా: మీనాక్షి చౌదరి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14, 2026న థియేటర్లలో విడుదల కానున్న ‘అనగనగా ఒక రాజు’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ఆ ఆసక్తి మరింత పెరిగింది.

సినిమా విడుదలకు సమీపిస్తున్న వేళ కథానాయిక మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ తన పాత్ర, సినిమా ప్రత్యేకతలు, కెరీర్‌పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వరుసగా సంక్రాంతికి సినిమాలు రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని విజయాన్ని అందుకున్నానని, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాననే నమ్మకం ఉందన్నారు.

ఈ చిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర పేరు చారులత అని, సంపన్న కుటుంబంలో గారాల పట్టిగా పెరిగిన యువతిగా కనిపిస్తానని చెప్పారు. అమాయకత్వం, సున్నితమైన మనసు, క్యూట్ బిహేవియర్‌తో కూడిన పూర్తి కామెడీ పాత్రలో తాను కనిపించనున్నానని తెలిపారు. నిజ జీవితానికి పూర్తిగా భిన్నమైన ఈ పాత్ర కోసం దర్శకుడు ఇచ్చిన సూచనలను బాగా అర్థం చేసుకుని హోంవర్క్ చేశానని చెప్పారు. తాను సాధారణంగా ప్రాక్టికల్‌గా ఉంటే, చారులత పాత్ర మాత్రం పూర్తిగా ఎమోషనల్, సెన్సిటివ్‌గా ఉంటుందని వివరించారు.

నవీన్ పొలిశెట్టితో కలిసి పని చేయడం ఒక సినిమా స్కూల్‌లో నేర్చుకున్నట్టే అనిపించిందని మీనాక్షి చెప్పారు. ఆయన కామెడీ టైమింగ్ ప్రత్యేకమని, ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్‌ను కచ్చితమైన టైమింగ్‌తో పలకడం తనకు పెద్ద ఛాలెంజ్‌గా మారిందని వెల్లడించారు. ఇప్పటివరకు తాను చేసిన పాత్రల్లో ఇదే అత్యంత ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. కొత్త తరహా కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సినిమా తన కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుందని మీనాక్షి అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయి కామెడీ పాత్ర చేయడం ఇదే తొలిసారి అని, దీని వల్ల నటిగా మరింత ఓపెన్ అయ్యానన్నారు. ‘లక్కీ భాస్కర్’లోని సుమతి పాత్రకు, ‘అనగనగా ఒక రాజు’లోని చారులత పాత్రకు ఏ మాత్రం పోలిక లేదని, ప్రతి పాత్రకు తాను కొత్తగా మారుతానని చెప్పారు.

సినిమాలో మాస్ డ్యాన్స్ నెంబర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ‘భీమవరం బాల్మా’, ‘రాజు గారి పెళ్లిరో’ లాంటి పాటలు క్యూట్ మాస్ ఫీల్‌తో ఉంటాయని, సాధారణంగా డ్యాన్స్ విషయంలో కొంచెం సంకోచం ఉన్నా, ఈ సినిమాలో చాలా సరదాగా షూటింగ్ చేశామని చెప్పారు. ప్రతి పాట ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతి ఎంతో మధురంగా ఉందని మీనాక్షి గుర్తు చేసుకున్నారు. అక్కడి ప్రజల ఆతిథ్యం, వంటకాలు, ఆలయాలు తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. సినిమా పట్ల గోదావరి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.

ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని, అలాంటి విభిన్న పాత్రలు తనకు రావడం సంతోషంగా ఉందని మీనాక్షి అన్నారు. తల్లి, ఐపీఎస్ అధికారి, ఇప్పుడు పూర్తిస్థాయి కామెడీ పాత్ర ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో కోణంలో కనిపిస్తున్నానని చెప్పారు. కథే హీరో అన్న నమ్మకంతోనే కథల ఎంపిక చేస్తానని, పాత్ర తన కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుందో చూసే నిర్ణయం తీసుకుంటానని వివరించారు.

సితార సంస్థలో ఇది తనకు మూడో సినిమా అని, ఆ బ్యానర్‌ను కుటుంబంలా భావిస్తానని చెప్పారు. యువ ప్రతిభను ప్రోత్సహించే సితార సంస్థలో వరుసగా అవకాశాలు రావడం అదృష్టమని, విభిన్న సినిమాలు చేయగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు మారి గురించి మాట్లాడుతూ, నూతన దర్శకుడైనా పూర్తి క్లారిటీతో, ఓపికతో పనిచేసే ప్రతిభావంతుడని ప్రశంసించారు.

సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెంలాంటిదని, ఎప్పుడూ కొత్తగా రుజువు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని మీనాక్షి స్పష్టం చేశారు. ప్రస్తుతం నాగ చైతన్యతో ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నానని, మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్టుల ప్రకటనలు త్వరలో వస్తాయని తెలిపారు. మొత్తంగా ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’తో ప్రేక్షకులకు నవ్వుల విందు ఖాయమని మీనాక్షి చౌదరి ధీమాగా చెప్పారు.

సినిమా

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు...

రాజకీయం

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఎక్కువ చదివినవి

నారా లోకేష్: ప్రజాప్రతినిధులతో సకుటుంబ సమావేశం.. ఉండవల్లిలో ఆత్మీయ కలయిక కనులవిందు

గుంటూరు, విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చిన ఆత్మీయ సమావేశం శనివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసంలో ఆహ్లాదకరంగా జరిగింది. ప్రజాప్రతినిధులంతా సకుటుంబంగా హాజరుకావడంతో...

బడ్జెట్‌తో స్వర్ణాంధ్ర 2047 దిశగా 360° అభివృద్ధికి బలమైన పునాది వేసాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి తీసుకెళ్లే దిశగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి 360 డిగ్రీల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వ్యవస్థాపక దినోత్సవం.. సేవల ప్రయాణానికి నారా లోకేష్ అభినందనలు

ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ప్రజలకు ఒక భరోసా, ఒక నమ్మకం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ నినదించిన “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు” అనే భావనతో ప్రేరణ పొందిన...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, ప్రేమకథగా...

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...