Meena: సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ పేరుతో సినీ నటులను టార్గెట్ చేయడం ఎక్కువైన నేపథ్యంలో కొన్ని యూట్యూబ్ చానెల్స్ పై మా అసోసియేషన్ నిషేధించిన సంగతి తెలిసిందే. నటీనటులను విమర్శిస్తున్న వీడియోలను డిలీట్ చేయాలని 48గంటల సమయం ఇస్తూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నటి మీనా హర్షం వ్యక్తం చేశారు.
‘మా అధ్యక్షుడిగా మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఇందుకు మా అసోసియేషన్ కు ధన్యవాదాలు. ఇండస్ట్రీతోపాటు నటీనటుల గౌరవాన్ని కాపాడటంలో మీరు చూపిస్తున్న చొరవకు అభినందనలు. ట్రోల్స్ ద్వారా నటీనటులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా తీసుకుంటున్న చర్యలు ఫలితాలనివ్వాలని కోరుకుంటున్నా. దీనిపై అందరం కలిసి ముందుకెళ్లాలి. నావైపు నుంచి మద్దతు ఎప్పుడూ ఉంటుంద’ని ఆమె పేర్కొన్నారు.
మీనా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటికే అయిదు యూట్యూబ్ చానెల్స్ ను రద్దు చేసిన ‘మా’ మరో 18 చానెల్స్ ను రద్దు చేసింది.