కాస్టింగ్ కౌచ్ .. సినిమా పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్న అంశం. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ లైంగిక వేధింపులకు గురయినట్టు బాహాటంగా చెప్పారు కూడా. ఈ విషయంలో మరికొంతమంది హీరోయిన్స్ కూడా ఇప్పుడిప్పుడే ఈ విషయం స్పందిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ తనపై జరిగిన లైంగిక వేధింపులపై ఘాటుగా స్పందించింది. తాజాగా ఈ వ్యవహారం పై స్పందించిన హీరోయిన్ ఎవరో కాదు సుర్విన్ చావ్లా? ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ హాట్ సినిమాలతో షాకిచ్చిన సుర్విన్ చావ్లా తెలుగులో కూడా రెండు మూడు సినిమాల్లో నటించింది.
తాజాగా సుర్విన్ చావ్లా ఓ ఇంటర్వ్యూ లో తనకు జరిగిన ఓ సంఘటన గురించి స్పందించింది. ఓ సినిమా సమయంలో ఓ దర్శకుడు తన బాడీ పార్ట్శ్ చూడాలని అనుకున్నాడని, మరో దర్శకుడు తన తొడలు ఎలా ఉంటాయో చూడాలని ఉందంటూ అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అయితే ఆ దర్శకులు ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు సుర్విన్ చావ్లా.
ప్రస్తుతం సుర్విన్ చావ్లా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తమకు జరిగిన లైంగిక వేధింపులపై స్పందించడం పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతోంది.
