మజాకా రివ్యూ: ఫన్‌తో కూడిన మజా

Critic Rating
( 2.75 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,310FansLike
57,764FollowersFollow
Movie మజాకా
Star Cast సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, అన్షు, గిరిబాబు, శ్రీనివాస రెడ్డి, హైపర్, మురళీ శర్మ
Director త్రినాధరావు నక్కిన
Producer రాజేష్ దండా
Music లియోన్ జేమ్స్
Run Time 2h 30m
Release 26 ఫిబ్రవరి 2025

క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ రోల్స్ నుంచి ఇంకో మెట్టు పైకెక్కుతున్నారు రావు రమేష్. రావు రమేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమాలు బాగానే వస్తున్నాయ్ ఈ మధ్య. ఆ కోవలోనే, హీరోతో సమానంగా వుండే రోల్, ‘మజాకా’ సినిమాలో చేశారు. మరోపక్క, చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్‌ హీరోగా, సెన్సిబుల్ మూవీస్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు తీయడంలో దిట్ట అయిన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో సినిమా.. అనగానే సినిమాపై అంచనాలు పెరిగాయ్. ప్రమోషన్స్ కూడా బాగానే చేసిన దరిమిలా, పెరిగిన అంచనాలకు తగ్గట్టు సినిమా వుందా.? కథలోకి వెళదాం పదండిక.

కథ

తండ్రి రమణ (రావు రమేష్), కొడుకు కృష్ణ (సందీప్ కిషన్) మాత్రమే వుండే ఇంటికి తమ కూతుర్ని కోడలిగా పంపించడానికి ఏ ఆడ పిల్ల తండ్రి మాత్రం ఇష్టపడతాడు.? అందుకే, కొడుక్కి పెళ్ళి చేయడానికి ఆపసోపాలు పడతాడు ఆ మగ పిల్లాడి తండ్రి. ‘ముందు నీకు పెళ్ళయితే, నీ కొడుక్కి సంబంధం చూడటం తేలిక’ అని పెళ్ళిళ్ళ పేరయ్య చెబితే, కరెక్టే కదా.. అనుకుని, ఓ మధ్య వయస్కురాలైన మహిళ వెంట పడతాడు రమణ. మరోపక్క, కృష్ణ కూడా ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న సమయంలో, ఓ పెద్ద వ్యాపారవేత్త వర్మతో తంటా వచ్చి పడుతుంది తండ్రీ కొడుకులకి. ఆ వర్మకీ, తండ్రీ కొడుకులు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నవాళ్ళకీ ఏంటి సంబంధం.? ఇంతకీ, తమ ఇంట్లో దీపం వెలగాలని, తండ్రీ కొడుకులు చేసే ప్రయత్నాలు ఏమవుతాయి.? ఇదంతా మిగతా కథ.!

ఎలా వుందంటే..

సందీప్ కిషన్, రావు రమేష్.. ఈక్వల్‌గా స్క్రీన్ షేర్ చేసుకున్నట్లే అనిపిస్తుంది. లవ్ ట్రాక్ దగ్గర్నుంచి, పాటల వరకు.. అన్నిటిలోనూ దాదాపుగా రావు రమేష్‌కి, సందీప్ కిషన్‌తోపాటు స్క్రిన్ స్పేస్ ఇచ్చాడు దర్శకుడు. పూర్తిగా ఫన్ మోడ్‌లో సినిమా సాగుతుంది. అక్కడక్కడా షుగర్ కోటెడ్ పిల్.. అన్నట్లుగా కొంత ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. దాంతో, సినిమా అంతా ఫన్ రైడ్ విత్ ఎమోషనల్ టచ్.. అనిపిస్తుంది. పాటలు కూడా సినిమా కథలో భాగమైపోయాయ్. ఒకట్రెండు తప్ప.! అవి కూడా హీరో, హీరోయిన్ల కోసం.. మాస్ టచ్.. సినిమా లిబర్టీ అనుకోవాలి. యాక్షన్‌ సీక్వెన్సెస్‌కి స్కోప్ వున్నా, అనవసరపు బిల్డప్, ఖర్చు దండగ.. అనుకున్నారేమో. లిమిట్ చేశారు, లిమిట్ చేయడం కూడా బానే వుంది.ఇంటర్వెల్ బ్లాక్, తండ్రీ – కొడుకుల మధ్య ఫన్, ఎమోషన్.. బాగా వర్కవుట్ అయ్యాయి. రితూ వర్మ, అన్షు మధ్య సీన్స్ అంతగా అతికినట్లు అనిపించవు. ఫోర్స్‌డ్‌గా వుంటాయ్. అదొక్కటీ కొంత మైనస్.

ఎవరెలా చేశారంటే..

సందీప్ కిషన్ కంటే ముందు, రావు రమేష్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకి అతనే హీరో.! యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అయిన సందీప్ కిషన్‌ని చాలా సీన్స్‌లో డామినేట్ చేసేశాడు రావు రమేష్. అలాగని, సందీప్ కిషన్ తక్కువేం కాదు. ఇద్దరు హీరోల సినిమా అనుకోవచ్చు దీన్ని.

హీరోయిన్ రితూ వర్మ ఓకే. ‘మన్మథుడు’, రాఘవేంద్ర’ తదితర సినిమాల తర్వాత, సినిమాలకు గుడ్ బై చెప్పిన అన్షు, చాలా కాలం తర్వాత తెరపై కన్పించింది. ఆమె నిజంగానే సినిమాలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్. కొన్ని సీన్స్‌లో రీతూ వర్మ కంటే నాజూగ్గా కనిపించింది అన్షు.

మురళీ శర్మ తన పాత్రకు తనదైన ప్రత్యేకతను అద్దాడు. సీనియర్ నటుడు రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, ఆది.. ఈ సినిమాకి కామెడీ పరంగా యాడెడ్ ఫ్లేవర్ అనుకోవచ్చు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్

సినిమాటోగ్రఫీ బావుంది. పాటలు ఫ్రెష్‌గా వున్నాయి. పాటలు వినడానికీ, చూడ్డానికీ బావున్నాయి. ఎడిటింగ్ షార్ప్‌గానే వుంది. డైలాగులు బావున్నాయి. నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్

  • సందీప్ కిషన్, రావు రమేష్
  • డైలాగ్స్
  • ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్

  • అన్షు – రీతూ వర్మ మధ్య సీన్స్
  • అన్షు‌తో రావు రమేష్ రొమాంటిక్ ట్రాక్ కొంత ఎబ్బెట్టుగా అనిపించడం

చివరగా

ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వించాలనుకున్నాడు దర్శకుడు. తండ్రీ కొడకు మధ్య సన్నివేశాలు కావచ్చు, ఫిమేల్ లీడ్ మధ్య వచ్చే సన్నివేశాలు కావొచ్చు.. చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు, వాటిని అందంగా తెరపై చూపించాడు కూడా. సినిమా ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. క్లీన్ కామెడీ.. విషయంలో దర్శకుడ్ని అభినందించి తీరాలి. అన్షు విషయంలో సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో దర్శకుడు నోరు జారి, క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. ఆమెను తెరపై అందంగా చూపించేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం కొంత మేర ఫలించింది. రావు రమేష్ నుంచీ, సందీప్ కిషన్ నుంచీ, దర్శకుడికి ఫుల్ సపోర్ట్ లభించింది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ అన్నిటినీ చాలా బ్యాలెన్స్‌డ్‌గా దర్శకుడు వాడుకున్నాడు. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే. కామెడీ సినిమాల్లో లాజిక్కులు వెతక్కూడదు. ఓవరాల్‌గా ‘మజాకా’, చూసే ప్రేక్షకులకి ఫన్‌తో కూడిన మజానే ఇస్తుంది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

సినిమా

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్...

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల పాటు Ramayana నుంచి ప్రేరణ పొందిన...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు ఖాళీగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేక్షకులను...

‘మెగా158’ కోసం భారీ సెట్స్… ఇంటర్వెల్ బ్లాక్‌తో షూట్ ప్రారంభం!

మెగాస్టార్ Chiranjeevi నటిస్తున్న మెగా158 చిత్రం కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయి సెట్స్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రబృందం, మొదటి షెడ్యూల్‌ను ఈ...

Daily Horoscope: ఏప్రిల్ 30 , 2026 గురువారం రాశిఫలాలు – సింహ రాశికి ఆర్థిక లాభ సూచనలు… మీన రాశికి కొత్త అవకాశాల ప్రారంభం

ఈ రోజు చంద్ర స్థితి ప్రకారం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్తతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందవచ్చు. కుటుంబ విషయాల్లో సమతుల్యత అవసరం. ఈ...

మంగ్లీ కేసులో మలుపు.. అరెస్ట్ ముంగిటేనా?

గాయని మంగ్లీకి సంబంధించిన మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా పోలీసులు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు...