పలు తమిళ చిత్రాలతో తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. మాస్ మహారాజ్ రవితేజ సహనిర్మాతగా వ్యవహరించిన మట్టి కుస్తీ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
వీర (విష్ణు విశాల్) కు జీవితంలో పెద్దగా ఏం అక్కర్లేదు. తనకు వచ్చే భార్యకు పొడుగు జుట్టు ఉండాలని మాత్రం కలలు కంటుంటాడు. అయితే టామ్ బోయ్ లా ఉండే కీర్తిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమె టామ్ బోయ్ మాత్రమే కాదు కుస్తీ పోటీల్లో నేర్పరి కూడా.
దీంతో వీర ఎదుర్కొనే పరిస్థితులు ఎలాంటివి? అన్నది చిత్ర కథ.
నటీనటులు:
విష్ణు విశాల్ ఈ చిత్రంలో బాగా చేసాడు. అయితే ఇదేమి ఇతనికి ఛాలెంజింగ్ రోల్ అయితే కాదు. ఇలాంటివి విష్ణు ఇంతకు ముందు చాలానే చేసాడు.
ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. కుస్తీ సీన్స్ లో, మిగతా సన్నివేశాల్లో ఆమె అదరగొట్టింది. ఆమె స్క్రీన్ మీద ఉన్నంత సేపూ అటెన్షన్ గ్రహిస్తుంది. మిగతా సపోర్టింగ్ కాస్ట్ కూడా ఓకే.
సాంకేతిక నిపుణులు:
చెల్లా అయ్యావు తీసుకున్న స్క్రిప్ట్ కొత్తగా ఏం ఉండదు. మనం ఇంతకుముందు చాలా సార్లు చూసేసిందే. అయితే ఇక్కడ ఉన్న కొత్తదనమల్లా భార్య కుస్తీ పోటీల్లో రాణించడం, ఫిజికల్ గా భర్త కన్నా బలంగా ఉండడం. అక్కడక్కడా ఎంటర్టైనింగ్ గా ఉన్న ఎపిసోడ్స్ ను పక్కన పెడితే చిత్రంలో చెప్పుకోవడానికంటూ ఏం లేదు. తన స్క్రీన్ ప్లే కూడా రొటీన్, బోరింగ్ గానే సాగింది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. అలాగే పాటలు కూడా. అయితే ఆడియన్స్ పై ఎలాంటి ముద్ర వేయవు. సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండవచ్చు. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.
ప్లస్ పాయింట్స్:
- ఐశ్వర్య లక్ష్మి పెర్ఫార్మన్స్
- విష్ణు విశాల్ స్క్రీన్ ప్రెజన్స్
మైనస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- వీక్ కాన్సెప్ట్
- ఊహించగల సెటప్
విశ్లేషణ:
మొత్తంగా చూసుకుంటే మట్టి కుస్తీ ఎలాంటి ఇంపాక్ట్ ఆడియన్స్ మీద క్రియేట్ చేయలేదు. అటు ఎంటర్టైన్మెంట్ కానీ ఇటు గ్రిప్పింగ్ కాన్సెప్ట్ కానీ లేని మట్టి కుస్తీని ఈజీగా స్కిప్ చేయవచ్చు.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5