తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని భావించిన పలువురు మహిళా నాయకురాలు, కార్యకర్తలు అధికారికంగా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తల్లూరి పార్టీ కండువా కప్పి వారిని ఆత్మీయంగా స్వాగతించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని రాష్ట్ర నాయకత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ ప్రకటన తెలంగాణ జనసైనికుల్లో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, అంకితభావంతో పని చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి ప్రేమ్ కుమార్, గ్రేటర్ జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటమే లక్ష్యంగా, స్వచ్ఛమైన రాజకీయాలే ధ్యేయంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని వారు స్పష్టం చేశారు.
