Majaka: సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మజాకా’. అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కిన సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటివలే సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందిందీ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా సినిమా నుంచి మాస్ డ్యాన్స్ నెంబర్ ‘పగిలి..’ పాట రిలీజ్ చేశారు మేకర్స్.
లియోన్ జేమ్స్ స్వరపరచిన మాస్ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సందీప్ కిషన్ ఎనర్జిటిక్ స్టెప్స్ తో అలరించారని సందీప్-రీతూ కెమెస్ట్రీ, మాస్ డ్యాన్స్ కెమిస్ట్రీ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని అంటున్నారు. సినిమాకు మాటల రచయితగా పని చేసిన బెజవాడ ప్రసన్న కుమార్ ‘పగిలి..’ పాటను రచించారు. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న విడుదలవుతున్న ‘మజాకా’ను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు.