Switch to English

సినిమా రివ్యూ : మన్మధుడు 2

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

నటీనటులు : నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రావు రమేష్, వెన్నేల కిషోర్, లక్ష్మి, ఝాన్సీ తదితరులు ..
రేటింగ్ : 2. 25 / 5
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు : నాగార్జున అక్కినేని, కిరణ్ పి.
సంగీతం : చేతన్ భరద్వాజ్
కెమెరా : ఏ సుకుమార్
ఎడిటింగ్ : చోట కె ప్రసాద్

దాదాపు పదిహేడేళ్ల క్రితం అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమా ఎలాంటి సంచలన విజయం అందుకుందో అందరికి తెలుసు. ఇప్పడూ ఆ చిత్రానికి సీక్వెల్ గా మన్మధుడు 2 పేరుతొ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. నాగార్జునకు కూడా ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పరాజయాలు అవుతుండడంతో ఆయనకు మంచి హిట్ కావాలి .. అందుకే ఈ కథను ఎంచుకున్నాడు. మరి రెండో మన్మదుడిగా నాగార్జున మెప్పించాడా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

సాంబశివ రావు అలియాస్ సామ్ ( నాగార్జున ) అతని ఫ్యామిలీ పోర్చుగల్ లో సెటిల్ అయిన తెలుగు కుటుంబం. సామ్ తల్లి ( లక్ష్మి ) అతని అక్కలు, చెల్లి తో కలిసి ఉంటాడు. అయితే వివాహం విషయంలో తనను ప్రేమించిన అమ్మాయి సుమ ( కీర్తి సురేష్ ) ని వాళ్ళు ఒప్పుకోరు దాంతో తన ఫ్యామిలీ తో గొడవ పెట్టుకున్న సామ్ కుటుంబానికి దూరంగా ఉంటాడు. కానీ ప్రతి ఆదివారం ఇంటికి వచ్చి వెళుతుంటాడు. అప్పటి నుండి పెళ్లి ఇష్టం లేక కేవలం అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ సరదాగా లైఫ్ ని గడిపేస్తూ ఉంటాడు. ఇతని దగ్గర పనిచేసే కిషోర్ ( వెన్నెల కిషోర్ ) సామ్ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ఆ తరువాత సామ్ తల్లి లక్ష్మి తన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఎలాగైనా సరే సామ్ కు మూడు నెలల్లో పెళ్లి చేయాలనీ గట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పెళ్లి నుండి తప్పించుకునేందుకు అవంతిక ( రకుల్ ప్రీత్ సింగ్ ) తో డ్రామా ఆడతాడు సామ్. ఆ తరువాత వీరి ఫ్యామిలీలో జరిగిన సంగటనలు ఏమిటి? చివరికి సామ్ కు పెళ్లయిందా ? అసలు అవంతిక ఎవరు అన్న విషయాలు మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

సాంబశివ రావు అలియాస్ నాగార్జున సామ్ పాత్రలో నడిపించేసాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో నాగార్జున వయసు విషయం తెలిసిపోతుంది. అందుకేనేమో .. నేను వయసులో పెద్దవాణ్ణి, ఏజ్ బార్ అంటూ తనపై తానే కామెడీ కూడా చేసుకున్నాడు నాగ్. ఒకరకంగా చుస్తే .. ఈ వయసులో కూడా నాగ్ .. ఇంకా మన్మదుడిగా కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక మన్మధుడు సినిమా తరహాలో అప్పటి మన్మదుడిని గుర్తుకు తెచ్చేలా కొన్ని సన్నివేశాల్లో నటించాడు. హీరోయిన్ గా చేసిన రకుల్ ఈ సినిమాతో మరో రేంజ్ నటిగా ఎదిగింది. ఇన్నాళ్లు మనం చుసిన రకుల్ వేరు .. ఈ అవంతిక వేరు. అవంతిక పాత్రలో మోడరన్ అమ్మాయిగా రకుల్ ఆకట్టుకుంది. గ్లామర్ విషయంలో అదరగొట్టింది. దాంతో పాటు నటి ఝాన్సీ కి లిప్ లాక్ ఇచ్చి మరి షాకిచ్చింది !! కిషోర్ గా వెన్నెల కిషోర్ పూర్తీ స్థాయి కామెడీ పాత్రతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో కిషోర్ మరో పదేళ్లు టాలీవుడ్ ని దున్నేయొచ్చు. అన్ని రకాల ఎమోషన్స్ ను పండించి ప్రేక్షకులను నవ్వించాడు. ఇక లక్ష్మి, రావు రమేష్, ఝాన్సీ తదితర నటీనటులు వారి వారి పాత్రల్లో బాగా చేసారు. గెస్ట్ రోల్స్ లో కీర్తి సురేష్, సమంత, బ్రహ్మానందం జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లారు ..

టెక్నీకల్ హైలెట్స్ :

మన్మధుడు 2 విషయంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎంచుకున్న కథే పెద్ద మైనస్. అసలు మన్మధుడు అనే టైటిల్ కి ఎలాంటి జెస్టిఫికేషన్ ఇవ్వలేదు. కనీసం పాత మన్మధుడు కథకు సీక్వెల్ గా ప్లాన్ చేసిన బాగుండేది. ఎలాంటి లాజిక్ లేని కథ, సంబంధం లేని సన్నివేశాలు. కథలో ఎక్కడ సీరియస్ నెస్ రాకపోవడం. బూతు డైలాగ్స్ .. డబుల్ మీనింగ్ చేష్టలు .. ఇవన్నీ ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టె అంశాలు. ఇక నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రంగా ఉంది. సినిమాకు ప్రధాన హైలెట్ ఫొటోగ్రఫీ, చోట కె ప్రసాద్ అందించిన ఫోటోగ్రఫి హైలెట్స్. అలాగే ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఇక డైలాగ్స్ బాగా పేలాయి .. కానీ అందులో డబుల్ మీనింగ్స్ ఎక్కువగా ఉండడం ఇబ్బంది పెట్టింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి దర్శకుడు ఎంచుకున్న కథలో ఎలాంటి లాజిక్ లేకపోవడం, ఏమాత్రం ఆకట్టుకొని సన్నివేశాలు, కేవలం నాగార్జునను ఇంకా రొమాంటిక్ గా చూపించే ప్రయత్నం కోసమే సినిమా చేశాడా అన్న అనుమానాలు కలుగుతాయి.

విశ్లేషణ :

మన్మధుడు సినిమా విషయంలో ప్రధానంగా కథ గురించి మాట్లాడుకోవాలి. సినిమా ప్రారంభం నుండి మన్మధుడు సినిమా సీక్వెల్ అంటూ ఆ క్రేజీ ని ఈ సినిమాకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన దర్శకుడు ఎక్కడ సంబంధం లేని కథకు మన్మధుడు అనే టైటిల్ పెట్టడం విచిత్రం. పైగా సన్నివేశాల్లో ఎక్కడ బలం ఉండదు. ఎంతసేపు హీరో కి పెళ్లి ఇష్టం లేదు .. అన్న విషయాన్ని చెప్పాడు, కానీ ఎందుకు ఇష్టం లేదు అన్నదాన్ని సీరియస్ గా చూపలేదు. దానికి బలమైన ఫ్లాష్ బ్యాక్ కూడా లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఇక హీరోయిన్ విషయంలో మరి ముదురులా మార్చేశాడు. డబ్బు కోసం ఆమె ఏదైనా చేస్తుంది అన్న రేంజ్ లో రకుల్ పాత్ర సాగడం ఫాన్స్ కి నిరాశ కలిగించింది. దాంతో పాటు డబుల్ మీనింగ్ డైలాగ్స్, చేష్టలు, ఏమాత్రం ఆకట్టుకొని సంగీతం, ఆర్ ఆర్. ఇక సినిమాకు హైలెట్ గా నిలచింది ఒక్క ఫోటోగ్రఫి మాత్రమే. దాంతో పాటు నాగ్ న్యూ లుక్ ఆకట్టుకుంది. మొత్తానికి నటుడు రాహుల్ రవీంద్రన్, దర్శకుడిగా మారిన తర్వాత చేసిన రెండో సినిమా మన్మధుడు 2 ద్వారా తన ప్రయత్న లోపాన్ని బయటపెట్టుకున్నాడు. ఆకట్టుకొని కథ, లాజిక్ లేని సన్నివేశాలు వెరసి మన్మధుడుతో ప్రేక్షకులను విసిగించాయి.

ట్యాగ్ లైన్ : ట్రాక్ తప్పిన .. మన్మధుడు !!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఎందుకు మాట్లాడకూడదు.?

న్యాయస్థానం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి మాట్లాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.. అదీ వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీసీసీ...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...