Mani ratnam-Shankar- భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అనుకునే రోజుల్లో.. దక్షిణాది సినిమాల రేంజ్ పరిచయం చేసిన దర్శకులు.. తెలుగు నుంచి రామ్ గోపాల్ వర్మ, తమిళం నుంచి మణిరత్నం, శంకర్. లవ్, ఫ్యామిలీ సినిమాలే తీసే మేకర్స్ కి హిందీ సినిమాలపై ప్రభావం చూపే మాఫియా కంటెంట్ టచ్ చేయాలంటే వణుకే. అప్పుడు మాఫియా కంటెంట్ టచ్ చేసి దక్షిణాది దర్శకుడిగా తన గట్స్ చూపించారు వర్మ. అసలు భారతీయ సినిమా మేకింగ్ మార్చేసిందే ఆర్జీవీ. అయితే.. టిపికల్ ఆలోచనలతో వర్మ తన బ్రిలియన్స్ తానే తగ్గించుకున్నారు. మణిరత్నం, శంకర్ రేసులోనే ఉన్నారు. కానీ.. ఫామ్ కోల్పోయారు. ఈ సమయంలో వారికి తామె తెరకెక్కిస్తున్న రెండు సినిమాలు పరీక్ష పెడుతున్నాయి.
మణిరత్నం.. మౌనరాగంతో అద్భుతం చేసి, గ్యాంగ్ స్టర్ కథ నాయకుడుతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. డార్క్ మోడ్ సినిమాలతో మేకింగ్ జీనియస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, టేకింగ్ ఆయన అస్త్రాలు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్ ఉన్నా.. జనరేషన్ గ్యాప్ తో రేసులో వెనుకబడ్డారు. మణిరత్నం మార్క్ లేదు. పొన్నియన్ సెల్వన్ తో సక్సెస్ అనిపించుకున్నా ఆయన రేంజ్ కాదు. ప్రస్తుతం కమల్ హాసన్ తో తీస్తున్న ‘థగ్ లైఫ్’ సవాల్ గా మారింది. ఇటివల వచ్చిన టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. కమల్ హాసన్ లైమ్ లైట్ లోకి రావడం.. సముద్రపు దొంగల కాన్సెప్ట్ కావడంతో మణి ఈజ్ బ్యాక్ అనిపిస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి.. మణిరత్నం సత్తా చూడాలంటే 2025 జూన్ 5వరకూ ఆగాల్సిందే.
శంకర్.. సామాజిక అంశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ లో దిట్ట. సినిమా స్కేల్ ను ఆయన ఆలోచించినట్టు 90-2k దశకాల్లో దేశంలో మరే దర్శకుడూ ఆలోచించలేదని చెప్పాలి. జెంటిల్మెన్, భారతీయుడు, అపరిచితుడు, రోబో, శివాజీ.. శంకర్ మ్యాజిక్స్. అటువంటి శంకర్.. రోబో తర్వాత వరుస సినిమాలు చేసినా తన మార్క్ మిస్సయ్యారు. ఇటివలి భారతీయుడు-2 ఆయన మేకింగ్ నే ప్రశ్నించింది. దీంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న ‘గేమ్ చేంజర్’పై అనుమానాలు. అయితే.. శంకర్ మార్క్ విజువల్స్, టేకింగ్ తో గేమ్ చేంజర్ టీజర్ ఉండటంతో.. ఇదీ శంకర్ అంటే అనేట్టు రామ్ చరణ్ అభిమానుల్లోనూ జోష్ వచ్చింది. అందరిలోనూ ఓ ఆశ. మరి.. శంకర్ కమ్ బ్యాక్ ఏంటో చూడాలంటే 2025 జనవరి 10వరకూ ఆగాల్సిందే.