మందకృష్ణ మాదిగ మీడియా ముందుకు వస్తారు.? ఆయన ఏదన్నా మాట్లాడాలంటే, తెరవెనుకాల నడిచే వ్యవహారాలేంటి.? తెలుగునాట రాజకీయాల గురించి కనీసపాటి అవగాహన వున్నవారందరికీ ఈ విషయాల గురించి బాగా తెలుసు.!
తాజాగా మందకృష్ణ మాదిగ మీడియా ముందుకొచ్చారు. ఏపీ హోం మంత్రి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ.. అంటూ సెలవిచ్చారు. ఆ విషయాన్ని ఆమె ఎన్నికల అఫిడవిట్‌లోనే పేర్కొన్నారు కదా.! ఇప్పుడు మందకృష్ణ వచ్చి ప్రత్యేకంగా ఆ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది.?
రాష్ట్రంలో పోలీసు శాఖ పని తీరుపైనా, హోంశాఖ పని తీరుపైనా నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తమయ్యింది. ఈ క్రమంలో ఏపీ హోం మంత్రి అనిత పేరు ప్రస్తావించారు పవన్ కళ్యాణ్.
తన పేరు ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అనిత నొచ్చుకోలేదు. పైగా, ఆయన వ్యాఖ్యలు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపాయనీ, మరింత బాధ్యతగా పని చేయాలన్న కసిని పెంచాయని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు.
కానీ, ఓ వైపు టీడీపీ అను‘కుల’ మీడియా, ఇంకో వైపు వైసీపీ అను‘కుల’ మీడియా ఒక్కటై, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా దురుద్దేశపూర్వక కథనాల్ని వండి వడ్డించడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో మందకృష్ణ మాదిగ కూడా తెరపైకొచ్చారు.
మందకృష్ణ మాదిగ అంటే పెయిడ్ ఆర్టిస్టే రాజకీయాల్లో.! అయితే, ఈ సారి ఆయనకు డబుల్ పేమెంట్ అందిందా.? అన్న చర్చ తెలుగు నాట రాజకీయాల్లో వినిపిస్తోంది. అక్కడ విషయం, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి. హోంమంత్రిని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకొచ్చింది.?
ఒకప్పుడు మందకృష్ణ మాదిగ కుల రాజకీయాలు బాగానే నడిచాయ్. కానీ, అవేవీ ఆయన్ని చట్ట సభలకు పంపలేకపోయాయ్.! కాలక్రమంలో మందకృష్ణ పేరు చెబితే, సొంత సామాజిక వర్గమే ‘ఛీకొట్టే’ పరిస్థితి వచ్చింది కూడా.! ఇప్పుడాయన మళ్ళీ ఆ పాత ముతక కుల రాజకీయాలు చేస్తానంటే, కుదరదిక్కడ.!