Switch to English

మంచు విష్ణు ఉవాచ: పవన్ కళ్యాణ్ వర్సెస్ టాలీవుడ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమా ఒక వైపు.. పవన్ కళ్యాణ్ ఇంకో వైపు.. ఇదీ సినీ నటుడు మంచు విష్ణు ఉవాచ. ‘నేను తెలుగు సినిమా పరిశ్రమ వైపు నిలబడ్డాను. ప్రకాష్ రాజ్ ఎవరి వైపు నిలబడతారు.? తెలుగు సినిమా వైపా.? పవన్ కళ్యాణ్ వైపా.?’ అంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు మంచు విష్ణు.

‘మా’ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తెరపైకి వచ్చిన వింత వాదన ఇది. తెలుగు సినిమా గురించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయనకు మద్దతుగా సినీ నటులు నాని, కార్తికేయ, బ్రహ్మాజీ తదితరులు స్పందించారు. అయితే, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రం, ‘ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఛాంబర్ పరంగా, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి సాయం అర్థిస్తున్నాం. ప్రభుత్వాలు లేకపోతే, పరిశ్రమ లేదు.. మా సమస్యల పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయనే నమ్మకంతో వున్నాం..’ అని పేర్కొంది.

దీనర్థం, పవన్ కళ్యాణ్ వేరు.. తెలుగు సినిమా పరిశ్రమ వేరు అని కాదు. కానీ, మంచు విష్ణు అలా అనుకుంటున్నట్టున్నారు. మంచు విష్ణు భావన నిజంగా అదే అయితే, పవన్ కళ్యాణ్ ఓటు కూడా తనకే పడుతుందని చెప్పడమేంటి.? పవన్ కళ్యాణ్ ఓటు మంచు విష్ణుకి కావాలి. కానీ, ఆ పవన్ కళ్యాణ్ వైపు ప్రకాష్ రాజ్ నిలబడితే.. అది తెలుగు సినీ పరిశ్రమకు వ్యతిరేకం. అత్యంత నీఛ స్థితికి దిగజారిపోయిన సాధారణ రాజకీయాల్ని మించి, సినిమా పరిశ్రమలో రాజకీయాలు దిగజారిపోయాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

పరిశ్రమ సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడితే, పరిశ్రమకు దూరంగా పవన్ కళ్యాణ్‌ని నెట్టేసి, ఆయన్ని వేరు చేసి చూపించడం ద్వారా కేవలం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూడటమా.? పైగా, ఇది తెలుగు సినిమా నటీనటుల ఆత్మగౌరవమని చెప్పడమా.? ముందు ముందు ఇంకెన్ని చిత్ర విచిత్రాలు ‘మా’ ఎన్నికల్లో చూడాల్సి వస్తుందోగానీ.. తెలుగు సినీ పరిశ్రమ స్థాయి రోజురోజుకీ మరింత దిగజారిపోయేలా.. ఈ ఎన్నికల వ్యవహారం నడుస్తున్నట్టుందనే భావన మాత్రం సగటు సినీ ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.

పరిశ్రమ సమస్యల గురించి పరిశ్రమకు చెందిన వ్యక్తి మాట్లాడితే, పరిశ్రమకు ఆయన్ని దూరంగా చేసిన మాట్లాడటం ఏ నైతిక విలువలకి నిదర్శనం.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...