Switch to English

మంచు విష్ణు ‘మోసగాళ్లు’ మూవీ రివ్యూ

Critic Rating
( 1.75 )
User Rating
( 5.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie మోసగాళ్లు
Star Cast మంచు విష్ణు, కాజల్ అగర్వాల్
Director జెఫ్రి గీ చిన్
Producer విష్ణు మంచు
Music సామ్ సి.యస్
Run Time 2గం. 15 ని
Release 19 మార్చి 2021

కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మంచు విష్ణు కథ నచ్చడంతో ఎంతో రిస్క్ చేసి చేసిన ఫిలిం ‘మోసగాళ్లు‘. టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్ స్కామ్ ని బేస్ చేసుకొని చేసిన ఈ సినిమాలో మంచు విష్ణు – కాజల్ అగర్వాల్ లు అన్న చెల్లెల్లుగా కనిపించారు. ఒకేసారి హాలీవుడ్ వెర్షన్, ఇండియన్ వెర్షన్ అని వేరు వేరుగా ఈ సినిమాని రూపొందించారు. మంచు విష్ణు రిస్క్ చేసి హై బడ్జెట్ తో చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

అర్జున్ (మంచు విష్ణు) – అను(కాజల్ అగర్వాల్) నాన్ ఐడెంటికల్ ట్విన్స్(ఫ్రాటెర్నల్ ట్విన్స్). ఒక పూర్ ఫ్యామిలీకి చెందిన అర్జున్ ఎప్పటికైనా డబ్బు సంపాదించి బాగా రిచ్ గా బతకాలని అనుకుంటాడు. కానీ కాల్ సెంటర్ లో పనిచేస్తూ, యుఎస్ పీపుల్ పర్సనల్ డేటాని డార్క్ వెబ్ కి అమ్ముతూ కొంత డబ్బు సంపాదిస్తుంటాడు. అది గమనించిన ఆ కంపెనీ సీఈఓ విజయ్(నవదీప్) అమెరికన్స్ పై స్కామ్ చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటారు. అలా అర్జున్ – విజయ్ కలిసి ప్రొఫెషనల్ గా స్కాం చేయడం స్టార్ట్ చేస్తారు. అను కూడా వీరికి సాయం చేస్తుంది. అలా స్కాం చేస్తూ ఫుల్ డబ్బులు సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తున్న టైంలో వీరి స్కాం గురించి యుఎస్ ఫెడరల్ కమీషన్ కి తెలుస్తుంది. ఇక అక్కడి నుంచీ అర్జున్ – అనులు స్కాంని సరికొత్తగా ఎలా మార్చారు? వారిని పట్టుకోవడం కోసం యుఎస్ కమీషన్ ఏం చేసింది? వారికి హైదరాబాద్ ఏసీపీ అజిత్ కుమార్ ఎలా సాయం చేసాడు? చివరికి అర్జున్ అనులు స్కాం నుంచీ బయట పడ్డారా? లేదా? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

మంచు విష్ణు అర్జున్ పాత్రలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ఇలాంటి పాత్ర ఇది వరకూ చేయలేదు అని చెప్పుకునే కొత్తదనం అయితే లేదు. కాజల్ అగర్వాల్ కి కాస్త మంచి పాత్రే పడిందని చెప్పాలి. రెండు డిఫరెంట్ షేడ్స్ మరియు స్ట్రాంగ్ లేడీ పాత్రలో మెప్పించింది. సునీల్ శెట్టి పాత్ర కూడా అంత స్ట్రాంగ్ గా లేదు. కచ్చితంగా బాలీవుడ్ ఆర్టిస్ట్ చేయాల్సిన పాత్ర అయితే కాదు. నవదీప్, నవీన్ చంద్ర, తనికెళ్ళ భరణి, రాజా రవీంద్రలు ఉన్నంతలో బాగా చేశారు. రూహీ సింగ్ రెండు సీన్స్ లో జస్ట్ గ్లామర్ అట్రాక్షన్ కోసం పెట్టారు.

తెర వెనుక టాలెంట్..

టెక్నికల్ డిపార్ట్మెంట్ లో బ్యాడ్ అని చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ముందుగా బాగున్న ఒకటి రెండు పాయింట్స్ మాట్లాడుకుందాం. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ బాగుంది. కార్పొరేట్ స్టైల్ విజువల్స్ బాగున్నాయి. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ మీద స్టార్ట్ అవ్వడం కాస్త ఊరట. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఇంతకంటే బెటర్ టెక్నికల్ వర్క్స్ లేవనే చెప్పాలి. సామ్ సీఎస్ మ్యూజిక్ జస్ట్ ఓకే ఓకే. గౌతమ్ రాజు ఎడింగ్ బాగానే ఉన్నా కథ – కథనాల వలన చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కనెక్షన్ అర్థవంతంగా ఉన్న ఫీల్ ఉంటుంది. నివాస్ డైలాగ్స్ కూడా నట గొప్పగా ఏమీ లేవు.

మెయిన్ గా మంచు విష్ణు రాసిన కథ విషయానికి వస్తే.. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ స్కాం కథ మన జీవితాలు, మన నేటివిటీ చుట్టూ తిరగకపోవడం వలన మొదట కనెక్ట్ కాదు.. పోనీ హీరో తోపు, తెలివైన వాడు అనే యాంగిల్ లో స్కాం చేస్తున్నాడు అనే యాంగిల్ లో తీసినా ఎప్పటికప్పుడు సరికొత్త గా ఎత్తులు వేస్తూ దొరక్కుండా చూసే హీరోయిజం అయినా ఉండాలి కానీ అది లేదు. ముఖ్యంగా ఇలాంటి కథలకి పెద్ద ఎమోషనల్ టచ్ ఉండకూడదు ఉన్నా కథకి బలాన్ని చేకుర్చాలే తప్ప బలహీనతగా తయారవ్వకూడదు. ఇక్కడ అదే జరిగింది, ఉదాహరణకి హీరో ఎప్పుడూ ఫామిలీనీ నా బలం – బలహీనత.. నేను చేసేది అంటా నా ఫ్యామిలీ కోసమే అంటాడు. కానీ చివర్లో పోలీసులు వెంటబడితే ఫామిలీని వదిలేసి వెళ్ళిపోతాడు, చివరికి కూడా తను సంపాదించిన డబ్బు ఉంటుందే తప్ప ఫామిలీ ఉండదు. అలాగే బ్రదర్ – సిస్టర్ మధ్య వచ్చే మనస్పర్థలు చాలా సిల్లీగా ఉంటాయి. సో సిల్లీగా అనిపించే పాయింట్స్ వలన ఎమోషనల్ కనెక్షన్ ఏముంటది చెప్పండి. సో అదీ వర్కౌట్ అవ్వలేదు. కావున ఏ పరంగానూ ఆడియన్స్ కి ఈ కథ కనెక్ట్ అవ్వరు. పోనీ కథనంలో అయినా అదిరిపోయే ట్విస్ట్స్ అండ్ వావ్ అనిపించే పాయింట్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేశాడా అంటే అదీ లేదు. వెంకీ వాయిస్ ఓవర్ లో ఉన్నంత ఎంగేజింగ్ కూడా కథనంలో లేకపోవడం బాధాకరం. ఇక డైరెక్టర్ గా జెఫ్రీ గీ చిన్ డైరెక్షన్ కూడా అంతంత మాత్రమే అని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి కానీ నిర్మాత విష్ణు చెప్పుకున్నంత భారీ బడ్జెట్ అయితే సినిమాలో కనిపించదు.

విజిల్ మోమెంట్స్:

– షెల్డన్ చౌ విజువల్స్
– కాజల్ అగర్వాల్ ప్రెజన్స్
– ఫస్ట్ హాఫ్ లో ఓకే అనిపించే ఒకటి రెండు సీన్స్

బోరింగ్ మోమెంట్స్:

– నేటివిటీ కనెక్షన్ లేని కథ
– బోరింగ్ నేరేషన్
– సాగదీసే కథనం
– వీక్ డైరెక్షన్
– థ్రిల్ చేయలేకపోయిన హైటెక్ మోసం
– జీరో ఎమోషనల్ కనెక్షన్
– నో ఎంటర్టైన్మెంట్

విశ్లేషణ:

యదార్థ సంఘటనల ఆధారంగా చేసిన సినిమా, పైగా ‘మోసగాళ్లు’ అనే క్రేజీ టైటిల్ చూసి ఇదేదో సూపర్బ్ స్కామ్ ఫిల్మ్, అదిరిపోయే థ్రిల్స్ ఉంటాయనుకున్నారో మీరు భారీగా మోసపోతారు. ఎందుకంటే సినిమాలో చూపించిన స్కాం పాయింట్ చూసి ఓకే ఇలా మోసం చేస్తారా అనిపిస్తుందే తప్ప ఆడియన్స్ ఎక్కడా థ్రిల్ అవ్వరు. కాజల్ అగర్వాల్ అప్పియరెన్స్ తప్ప పెద్దగా హోల్డ్ చేసే విష్యం సినిమాలో లేదు. ‘మోసగాళ్లు’ సినిమాతో హిట్ కొడతాను అనుకున్న మంచు విష్ణుకి ఇది కూడా నిరాశనే మిగిల్చింది.

చూడాలా? వద్దా?: మోసగాళ్లు చూస్తే మీరు మోసపోతారు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 1.75/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...