Switch to English

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి అదీ ఇదీ మాట్లాడరు.. ఇది కూడా మంచు విష్ణు చెప్పిన మాటే. కానీ, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు ప్యానెల్ తిరుపతి వెళ్లింది. మీడియా ముందుకొచ్చింది. ఏంటిదంతా.? ఎందుకీ పబ్లిసిటీ తంటా.?

‘మా’ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకెన్నాళ్లీ గోల.? ఎవరి కోసం ఈ గోల.? ఎందుకోసం ఈ గోల.? సామాన్యుడికి ఈ గోలతో కాస్తయినా సంబంధం ఉందా.? అస్సలు లేదు. సెలబ్రిటీలైనంత మాత్రాన మీడియా గొట్టాలు మరీ ఎగేసుకుంటూ వాళ్ల దగ్గరికి వెళ్లిపోవాలా.? తెర వెనుక ఏం జరుగుతోంది.?

గత కొంత కాలంగా ‘మా’ ఎన్నికల చుట్టూ మీడియా, రాజకీయ వర్గాల్లోనూ, సినీ, సోషల్ మీడియా వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయ్. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఖర్చు చేసినట్లు.. వ్యూహాలు పన్నినట్లు.. బెదిరింపులకు దిగినట్లు, ప్రలోభాలకు పాల్పడినట్లు.. ఈ మా ఎన్నికల కోసం కూడా పెద్ద తతంగమే నడిచిందన్నది ఆ చర్చల సారాంశం.

ప్రతిరోజూ పెట్రో ధరలు మండిపోతున్నాయ్. రాష్ర్టాలూ, దేశం అప్పుల పాలైపోతున్నాయ్. సామాన్యుడి బతుకు సర్వనాశనమయిపోతోంది. అత్యాచారాలు, హత్యలు, ప్రమాదాలు.. ఎడా పెడా జరుగుతున్నాయ్. ఇవేవీ మీడియాకు పట్టడం లేదు.

హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నికల చుట్టూ కూడా ఇంత యాగీ జరగడం లేదు. మీడియా ఈ ఉప ఎన్నికల కంటే, ‘మా’ రచ్చ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడానికి కారణమేంటీ.? తమ సినిమా ప్రమోషన్ల కోసం మీడియాకి నిర్మాతలు పేమెంట్లు చేయడం మామూలే. అలాంటి కథేమన్నా ‘మా’ ఎన్నికల చుట్టూ నడిచిందా.? ఒకవేళ అదే నిజమైతే ఆ ప్యాకేజీ ఎంత కాలానికి కుదిరింది.? ఇదో డౌటు.

బైలాస్ మార్చేయడం, సభ్యుల్ని తీసేయడం లాంటి ఆలోచనలేవో ఎవరి మదిలోంచో పుట్టుకొచ్చినట్లున్నాయ్. అవన్నీ జరిగే వ్యవహారాలేనా.? జరుగుతాయో.? లేదో.? ఎవర్నో భయపెట్టడానికి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయ్. వీటి వల్ల పరిశ్రమలో సఖ్యత చెడిపోతుంది. చూస్తుంటే, సినీ పరిశ్రమ వినాశనం కోసమే ఈ సారి ‘మా’ ఎన్నికలు వచ్చాయా.? అన్న అనుమానమైతే సగటు సినీ అభిమానికి కలుగుతోంది.

అన్నట్టు, తిరుపతికి వెళ్ళారు.. సిని‘మా’ రాజకీయాలు మాట్లాడారు.. అట్నుంచటే అమెరికా వెళ్ళి ఓ పాలి అక్కడా ప్రెస్ మీట్ పెట్టేస్తే పోలా.? అని మంచు విష్ణు అండ్ టీమ్‌పై సెటైర్లేస్తున్నారు నెటిజన్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

లొకేషన్స్ వేటలో పడ్డ హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోన్న విషయం తెల్సిందే. గతంలో వీరి కాంబినేషన్ లో...

బిగ్ బాస్ 5: ఈసారి ఏ కంటెస్టెంట్ కు మూడింది?

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఇంకా హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారాంతం ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే...

అఖండ: బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించిన బాలయ్య

ఒక మాస్ సినిమా కలిగించే ఊపు వేరు. బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి వచ్చిన అఖండ పేరుకి తగ్గ రీతిలో అఖండమైన ఓపెనింగ్ ను...

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో...

రాజకీయం

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

ఎక్కువ చదివినవి

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

రాశి ఫలాలు: బుధవారం 01 డిసెంబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం సూర్యోదయం: ఉ.6:17 సూర్యాస్తమయం : సా‌.5:20 తిథి: కార్తీక బహుళ ద్వాదశి రా.8:13 నిమిషముల వరకు తదుపరి కార్తీక బహుళ త్రయోదశి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము: చిత్త...

సిద్ధ పాత్రపై పూర్తి క్లారిటీ ఇచ్చిన చరణ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కూడా చేస్తున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. చరణ్ ఈ చిత్రంలో సిద్ధగా కనిపించనున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన సిద్ధ...

రాజధాని అమరావతి: ఈ ‘యూ టర్న్’ మంచిదే.!

మాట తప్పం.. మడమ తిప్పం.. అనే హక్కు ఇకపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ వుండదు. ఎందుకంటే, చట్ట సభల సాక్షిగానే మాట తప్పేశారు.. మడమ తిప్పేశారు. ఇకపై బేషజాలు అనవసరం. రాజధాని...

బిగ్ బాస్ 5: మానస్ కు ప్రియాంక సిస్టర్ ఎందుకు సారీ చెప్పినట్లు?

బిగ్ బాస్ 5 లో ఫ్యామిలీ ఎపిసోడ్ నిన్న కూడా కంటిన్యూ అయింది. సన్నీ వాళ్ళ అమ్మ గారు రావడంతో మొన్నటి ఎపిసోడ్ ఆపేసారు. నిన్నటి ఎపిసోడ్ లో అక్కడి నుండే కంటిన్యూ...