Switch to English

ప్రముఖ హీరోని టార్గెట్ చేసిన మంచు విష్ణు.! ‘జిన్నా’ ప్రమోషన్స్ కోసమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

అప్పుడెప్పుడో జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల సమయంలో ట్రోలింగ్ చోటు చేసుకుంటే, దానికి సంబంధించి ఇప్పుడు చట్టపరమైన చర్యలంటూ సినీ నటుడు, ‘మా’ అధ్యక్షుడు, నిర్మాత మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అన్నదానిపై సినీ వర్గాల్లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

‘మా’ ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవిని మంచు విష్ణు అండ్ టీమ్ ఏ స్థాయిలో టార్గెట్ చేసిందో చూశాం. ఆ ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేయలేదు, ఎవరికీ మద్దతిస్తున్నట్లు చిరంజీవి చెప్పలేదు. చిరంజీవి ఆశీస్సులు ప్రకాష్ రాజ్‌కి వున్నాయని నాగబాబు మాత్రమే చెప్పారు.

‘నన్ను పోటీలోంచి తప్పుకోమని చిరంజీవిగారు చెప్పారు..’ అంటూ విష్ణు రచ్చ చేశాడు. చిరంజీవి అస్సలు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ‘మా’ ఎన్నికల సమయంలో ఎంత రాజకీయం నడిచిందో చూశాం. పోలింగ్ సమయంలో చిన్నపాటి కొట్లాట కూడా జరిగింది. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవడం వల్ల, సినీ పరిశ్రమకు అదనంగా ఒరిగిందేంటి.? అంటే, ప్చ్.. ఏమీ లేదనే చెప్పాలి.

‘నేను గెలిస్తే, నా సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి సొంత భవనం కట్టిస్తాను..’ అంటూ అప్పట్లో ప్రకటించిన మంచు విష్ణు, ఇంతవరకు ఆ భవనం గురించి మాట్లాడటంలేదు.

తన తాజా సినిమా ‘జిన్నా’ ప్రచారం కోసం, ‘మా’ ఎన్నికల సమయంలో జరిగిన ట్రోలింగ్ వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చినట్లున్నాడు. ఇక్కడా ఓ ప్రముఖ నటుడు.. అంటూ, మంచు విష్ణు.. తన పాత విధానాన్నే అనుసరిస్తూ, పబ్లిసిటీ స్టంట్లను తెరపైకి తీసుకురావడం గమనార్హం.

ఓ ప్రముఖ నటుడికి జూబ్లీహిల్స్ ప్రాంతంలో 21 మంది ఉద్యోగులతో సాఫ్ట్‌వేర్ కంపెనీ వుందట. ఆ కంపెనీ ఐపీ అడ్రస్ తమకు దొరికిందట.. పోలీసులకు ఫిర్యాదు చేసి, వారి సంగతి తేల్చుతానంటున్నాడు మంచు విష్ణు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ మీద ‘ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టే వ్యాఖ్యలు’ సహా.. ‘మా’ ఎన్నికల సమయంలో చాలా వ్యవహారాలు నడిచాయి. అవన్నీ విష్ణు టీమ్ నుంచే జరిగాయ్. అవన్నీ గతం.. అని అంతా మర్చిపోయారు.

మళ్ళీ ఇప్పుడు, ఆనాటి ట్రోల్స్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి, మళ్ళీ ప్రముఖ నటుడు.. సాఫ్ట్‌వేర్ కంపెనీ.. అంటూ మంచు విష్ణు చేసిన ఈ రచ్చ ‘జిన్నా’ సినిమా విడుదల వరకూ వుంటుందా.? ఆ తర్వాత కూడా కొనసాగుతుందా.? వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...