Switch to English

భారీ సినిమాలతో మంచు ఫ్యామిలీ.. బిజీ!!

ప్రముఖ నటుడు మోహన్ బాబు .. ఈ మధ్య సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ .. ఎక్కువగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఏది పడితే అది చేయనని చెప్పిన మోహన్ బాబు .. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఆకాశం నీ హద్దురా సినిమాలో నటిస్తున్నాడు. దాంతో పాటు మణిరత్నం క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. అయితే త్వరలోనే అయన డ్రీమ్ ప్రాజెక్టు కూడా పట్టాలు ఎక్కబోతుంది. అవునూ మోహన్ బాబు ఎన్నో రోజులుగా అనుకుంటున్నా ప్రాజెక్ట్ త్వరలోనే మొదలు కానున్నట్టు నిన్న శివరాత్రి సందర్బంగా ప్రకటించారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 60 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయించారట. మంచు విష్ణు నిర్మించే ఈ సినిమా టైటిల్ ఏమిటో తెల్సుగా .. భక్త కన్నప్ప !! మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు కీ రోల్ పోషించే ఈ సినిమా గురించి నిన్న అనౌన్స్ చేసారు. త్వరలోనే మిగతా టీమ్ ని సెలెక్ట్ చేసి అనౌన్స్ చేస్తామని అన్నారు. ఇక ఇప్పటికే మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ .. అహం బ్రహ్మాస్మి అనే ట్రెడిషనల్ టైటిల్ తో ఏకంగా పాన్ ఇండియా సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇక మంచు విష్ణు ఇప్పటికే మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు. సైబర్ క్రైం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. మొత్తానికి మళ్ళీ వరుస సినిమాలతో మంచు ఫ్యామిలీ హీరోలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

మహానటిని రికమెండ్ చేసిందంటే ఏదో మతలబుంది?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంతో పాటు చూసిన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా...

‘సమంత’కు పూజా క్షమాపణలు చెప్పాల్సిందే

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇన్స్టా ఖాతాలో నిన్న వచ్చిన ఒక పోస్టు తాజాగా దుమారానికి కారణమయింది. ఆ పోస్టులో మజిలీ చిత్రంలోని సమంతా ఫోటోకు ‘ఏమంత అందంగా లేదు’ అంటూ క్యాప్షన్...

నాకు తప్పుడు మందులిచ్చి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తున్నారు – డా.సుధాకర్

మే 16వ తేదీన మద్యం మత్తులో డా. సుధాకర్ నడిరోడ్డులో రభస చేయడమే కాకుండా, అధికార పార్టీపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని మెంటల్ కండిషన్...

డాక్టర్‌ బాబుకు మెగాస్టార్‌ తల్లి ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

తెలుగు బుల్లి తెరపై ఇప్పటి వరకు ఎన్నో వందల సీరియల్స్‌ వచ్చాయి. కాని కార్తీక దీపం సీరియల్‌కు వచ్చినంత ప్రజాధరణ ఏ సీరియల్‌కు రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీక దీపం...

మహిళా వాలంటీర్ ఆత్మహత్య.. మరో వాలంటీర్ తో ప్రేమే కారణమా..?

పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు వారి ఇంటి వద్దకే చేరాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ అక్కడక్కడా అసలు లక్ష్యం తప్పుతోంది. వ్యక్తిగతంగా వలంటీర్లపై వస్తున్న విమర్శలతో అభాసుపాలు అవుతోంది. విశాఖ...