ఈ నడుమ మంచు ఫ్యామిలీలో వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మనోజ్ ఒక్కడు ఒకవైపు ఉంటే మిగతా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంది. కుటుంబంలో గొడవలు కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది. ఇంత జరుగుతున్న సమయంలో తాజాగా మనోజ్ చేసిన పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేడు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ తన తండ్రిని తలచుకుంటూ ఎమోషనల్ పోస్టు చేశాడు. ఇందులో తండ్రి ఫొటో, వీడియోలను పోస్టు చేశాడు. దానికి యానిమల్ సినిమాలోని నా సూర్యుడివి, నా చంద్రుడివి అనే సాంగ్ ను యాడ్ చేశాడు.
తన తండ్రి సినిమా ఇండస్ట్రీలో ఎదిగిన తీరును, తనతో ఆయన గడిపిన క్షణాలను ఈ వీడియోలో డిజైన్ చేశాడు ఆ పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఇందులో ‘నాన్న నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సమయంలో నీ పక్కన లేకపోవడం నాకు బాధగా ఉంది. నీ వెంట నడవడానికి వెయిల్ చేస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు. తండ్రిపై మనోజ్ కు ఉన్న ప్రేమ ఈ పోస్టులో కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్టును చూసిన వారంతా తండ్రి, కొడుకుల మధ్య అనుబంధం ఎప్పటికీ చెరగదు అంటూ పోస్టులు చేస్తున్నారు. మనోజ్ మనసులో ఇంత ప్రేమను దాచుకున్నాడా అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.