Manchu Manoj: మంచు మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవ జరిగిందని.. ఇద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారని ఈరోజు ఉదయం నుంచీ వార్తలు వచ్చాయి. అయితే.. ఇవన్నీ నిరాధారమని.. అసత్యాలు ప్రచారం చేయొద్దంటూ మోహన్ బాబు కుటుంబం నుంచి ఓ ప్రకటన వచ్చింది. అయితే.. నడవడానికి ఇబ్బందిపడేలా మనోజ్ కాలికి గాయం కావడం.. ఆసుపత్రిలో చేరడం సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జరిగిన ఘటనపై వీరిని మీడియా ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు.
ఆస్తుల విషయంలో వీరిద్దరి మధ్యా గొడవ జరిగిందని ఓవైపు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సమయంలో మనోజ్ భార్య కూడా అక్కడే ఉన్నారని అంటున్నారు. ఆసుపత్రికి మనోజ్ వస్తున్నప్పుడు కూడా ఆమ పక్కనే ఉన్నారు. దీంతో ఉదయం నుంచి వచ్చిన వార్తలపై ఇండస్ట్రీ, మీడియా, ప్రేక్షకుల్లో చర్చాంశనీయమైంది. మరోవైపు.. మోహన్ బాబు-మనోజ్ 100 ద్వారా ఫిర్యాదు చేశారని.. పోలిస్ స్టేషన్ కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించినట్టు పోలీసులు అంటున్నారు.