ఇటివలే మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈక్రమంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు సోదరి మంచు లక్ష్మీతో కలిసి వెళ్లారు. వారికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. రేపు మా సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శంచుకోనున్నారు. ఈనేపథ్యంలో ఎయిర్ పోర్టు వద్ద ఇటివలి పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు. నూతన మా భవానానికి మూడు నెలల్లోగా స్పష్టత ఇస్తానని విష్ణు అన్నారు.
లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. ‘విష్ణు గెలవాలని ఆంధ్ర,తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. విష్ణు గెలుపును కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోలేదని.. ఎడమొహం పెడమొహంగా ఉన్నారని టీవీల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఏదేదో రాస్తున్నారు. ఇండస్ట్రీలో మేమంతా కలిసి ఉన్నట్లే’ అని స్పష్టతనిచ్చారు.