Manchu Family: మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల విషయంలో గొడవలు జరిగాయని ఉదయం నుంచీ వార్తలు హల్ చల్ చేశాయి. తండ్రి మంచు మోహన్ బాబు తనపై, తన భార్యపై దాడి చేశారంటూ గాయలతో వచ్చి పోలిస్ స్టేషన్లో కుమారుడు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని.. కుమారుడే తనపై దాడి చేశాడంటూ మోహన్ బాబే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదే చేసినట్టు ఆ వార్తల సారాంశం. దీంతో సినీవర్గాలే కాకుండా ప్రేక్షకుల్లో కూడా అసలేం జరుగుతుందోనని ఆసక్తి చెలరేగింది. దీనిపై మంచు కుటుంబం స్పందించింది.
‘మోహన్ బాబు–మంచు మనోజ్ మధ్య మనస్పర్దలు వచ్చాయని.. పరస్పరం ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వెళ్లి పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కధనాలు అవాస్తవం. కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలను చేయకం’డంటూ ఓ ప్రకటన వారి మోహన్ బాబు కుటుంబం నుంచి వచ్చింది.