Switch to English

మంచి రోజులు వచ్చాయి మూవీ రివ్యూ

Critic Rating
( 2.25 )
User Rating
( 2.20 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie మంచి రోజులొచ్చాయి
Star Cast సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి
Director మారుతి
Producer ఎస్ కె ఎన్
Music అనూప్ రూబెన్స్
Run Time 2 hr 16 Mins
Release November 4,2021

కామెడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పేరు సంపాదించుకున్న నోటెడ్ దర్శకుడి నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం మంచి రోజులు వచ్చాయి. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ లు లీడ్ రోల్ లో నటించారు. దీపావళి సందర్భంగా ఈరోజు విడుదలవుతోన్న ఈ చిత్రానికి ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

గోపాలం తిరుమలశెట్టి (అజయ్ ఘోష్) ఎప్పుడూ ఏదో విషయానికి భయపడుతూ ఉంటాడు. గోపాలం వ్యక్తిత్వాన్ని అడ్వాంటేజ్ తీసుకున్న కాలనీ వాసులు తన పెద్ద కూతురు పద్మిని (మెహ్రీన్) రిలేషన్ షిప్ స్టేటస్ గురించి లేనిపోనివి చెప్పి మరింత భయపెడుతుంటారు. గోపాలం భయపడినట్లుగానే పద్మిని సంతోష్ (సంతోష్ శోభన్) అనే వక్తితో రిలేషన్ లో ఉంటుంది. సహజంగానే గోపాలం వీరి ప్రేమకు ఆమోదం తెలపడు. ఎలా గోపాలాన్ని సంతోష్ తమ పెళ్ళికి ఒప్పిస్తాడు అన్నది మిగతా కథ.

పెర్ఫార్మన్స్:

పెళ్లి కోసం కష్టపడే ప్రేమికుడిగా సంతోష్ శోభన్ తన పాత్రలో బాగానే నటించాడు. ఏక్ మినీ కథ కంటే ఇందులో మరికొంత మెచ్యూరిటీ కనిపించింది సంతోష్ పెర్ఫార్మన్స్ లో. మెహ్రీన్ తో సంతోష్ కెమిస్ట్రీ కూడా చూడటానికి బాగుంది. మెహ్రీన్ పెర్ఫార్మన్స్ పరంగా ఓకే కానీ బాగా స్లిమ్ అయిపోవడంతో ఆమె ఫేస్ లో గ్లో పోయినట్లుగా అనిపించింది. అయితే ఎమోషనల్ సన్నివేశాల్లో మెహ్రీన్ ఇంప్రెసివ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

మంచి రోజులు వచ్చాయి చిత్రానికి మెయిన్ పిల్లర్ అజయ్ ఘోష్ క్యారెక్టర్. సినిమా అంతటా తన పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అటు ప్రేమ ఇటు అనుమానం ఉన్న తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ చాలా బాగా రాణించాడు. అజయ్ ఘోష్ స్నేహితులుగా నటించిన వారు కూడా మెప్పించారు. వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, సుదర్శన్, ప్రవీణ్ వంటి చాలా మంది కమెడియన్లు ఈ సినిమాలో ఉన్నారు కానీ ఎవరి పాత్ర కూడా పొట్టచెక్కలయ్యే రేంజ్ లో లేదు.

సాంకేతిక నిపుణులు:

అనూప్ రూబెన్స్ సంగీతం బాగానే ఉంది. అన్ని పాటలు కూడా ఇబ్బంది పెట్టకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కినా కానీ ఎక్కడ రాజి పడకుండా తీశారు.

దర్శకుడు మారుతి విషయానికొస్తే మరో సింపుల్ కాన్సెప్ట్ ను తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేసాడు. ఎప్పుడూ తన సినిమాలో ప్రముఖ పాత్రలకు ఏదో ఒక డిఫెక్ట్ పెట్టి కామెడీ పండించే మారుతి ఈసారి కూడా అదే పాయింట్ తీసుకున్నాడు. అసలు మెయిన్ పాయింట్ బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో కొంత దారితప్పాడు.

పాజిటివ్ పాయింట్స్:

  • బేసిక్ ఐడియా
  • పెర్ఫార్మన్స్

నెగటివ్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • టేకింగ్

విశ్లేషణ:

మంచి రోజులు వచ్చాయి పాయింట్ బాగున్నా, ఈరోజుల్లో అవసరమైనదే అయినా కూడా ఎగ్జిక్యూషన్ విషయంలో ఫెయిల్ అయింది. పెర్ఫార్మన్స్ లు పక్కన పెడితే ఈ సినిమా పెద్దగా ఇంప్రెస్ చేసేది ఏం ఉండదు. దీపావళి వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. లిమిటెడ్ బడ్జెట్ అవ్వడం కూడా ఒక రకంగా కలిసొచ్చేదే. అయితే థియేటర్లలో చూసే సినిమా అయితే కాదు ఇది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏప్రిల్ 5న విడుదల...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...