మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, రీజినల్ సినిమా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.
విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అభిమానులను థియేటర్లకు పోటెత్తేలా చేశాయి. ఫెస్టివల్ సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీగా థియేటర్లకు తరలివస్తున్నారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ఇప్పటికే పలు రీజినల్ రికార్డులను తిరగరాస్తూ, అత్యంత వేగంగా ₹200 కోట్ల క్లబ్‌లోకి చేరిన చిత్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ సినిమాకు అదిరిపోయే స్పందన లభిస్తోంది.
సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా హవా కొనసాగుతోంది. అభిమానులు #ManaShankaraVaraPrasadGaru, #MegaSankranthiBlockbusterMSG హ్యాష్‌ట్యాగ్‌లతో రికార్డు కలెక్షన్లను సెలబ్రేట్ చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ సినిమా నిలుస్తుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
వీకెండ్‌కు ఇంకా భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తుండటంతో, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దూకుడు మరికొన్ని రోజులు ఆగేలా కనిపించడం లేదు. మొత్తంగా ఈ సినిమా, సంక్రాంతి బరిలో తిరుగులేని విజేతగా నిలిచింది అని చెప్పవచ్చు.
