సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఒక్కో సందర్భంలో ఒక్కో హీరోయిన్, నటి దాన్ని బయట పెడుతూనే ఉన్నారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఇండస్ట్రీలో చర్చకు తెరలేపిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ మల్లికా శరావత్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. అప్పట్లో బాలీవుడ్ లో మల్లికా శరావత్ అంటే ఓ ఐటెం బాంబ్. అప్పట్లో కుర్రాళ్లకు ఆమె శృంగార దేవత. ఆ కాలంలోనే బికినీలు వేసి హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను ఉర్రూతలూగించింది ఈ బ్యూటీ.
దాంతో అప్పట్లో ఆమెపై తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. ఇక కొత్తతరం హీరోయిన్లు రావడంతో ఆమెకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె గతంలో తాను ఎదుర్కున్న ఘటన గురించి చెప్పింది. నేను గతంలో ఓ సినిమా షూటింగ్ కోసం దుబాయ్ కు వెళ్లాను. అక్కడ హోటల్ లో రాత్రి రెస్ట్ తీసుకుంటున్నాను. అయితే ఆ మూవీ హీరో అర్ధరాత్రి సమయంలో బాగా తాగిన తర్వాత నా రూమ్ తలుపులు కొట్టాడు. దాంతో నేను భయపడ్డాను. నేను తలుపు తీయకపోయేసరికి మరింత బలంగా తలుపులు కొడుతున్నాడు.
ఆ హీరో నా రూమ్ లోకి రావొద్దని నేను ఆ దేవుడిని కోరుకున్నాను. ఆ హీరో చాలా సేపు తలుపులు కొట్టి వెళ్లిపోయాడు. ఆ మూవీ తర్వాత మళ్లీ అతనితో కలిసి నటించలేదు అంటూ చెప్పుకొచ్చింది మల్లికా శెరావత్. ఇదే కాకుండా ఇలాంటి ఘటనలు చాలానే ఎదుర్కున్నానని ఆమె వివరించింది.