సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిషన్ రిపోర్టు ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అగ్ర హీరోలు, దర్శకులపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఉదంతం మర్చిపోక ముందే.. మొన్న టాలీవుడ్ లో అగ్ర కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ మీద రేప్ కేసుకూడా నమోదైంది. ఆ తర్వాత చాలా మంది బయటకు వస్తూ తమ మీద కూడా లైంగిక వేధింపులు వచ్చాయంటూ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి ఆరోపణలు చేసింది.
ఆమె ఎవరో కాదు మలయాళ నటి మిను మునీర్ కూడా ఈ విషయాలను బయట పెట్టింది. తాను గతంలో ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో.. ఆ మూవీని స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నట్టు చెప్పింది. అతను తమతో కలిసి కూర్చుని గ్రూప్ సెక్స్ వీడియోలు చూడాలంటూ నన్ను ఫోర్స్ చేశాడు. దాంతో అతని ప్రవర్తన నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత కూడా నన్ను తన గదిలోకి పిలుచుకున్నాడు. నేను వెళ్లే సరికి అప్పటికే అక్కడ అతనితో పాటు మరో ముగ్గురు యువతులు కూడా ఉన్నారు. వారంతా కలిసి గ్రూప్ సెక్స్ వీడియోలు చూస్తున్నారు.
వాళ్లు నన్ను కూడా అలా చేయాలంటూ ఫోర్స్ చేశారు. దాంతో అక్కడి నుంచి నేను బయటకు వచ్చేశాను. నాకు ఇప్పటికీ ఆ విషయం గుర్తుంది. అందుకే మలయాళ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్లిపోయాను అంటూ మిను మునీర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో మలయాళ ఇండస్ట్రీలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయా అంటూ అందరూ షాక్ అవుతున్నారు