Switch to English

లీక్ అయిన అల్లు అర్జున్ ‘పుష్ప’ స్టోరీలోని కీ పాయింట్.!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ అందుకొని, ఈ సారి పాన్ ఇండియా స్థాయిలోనే రికార్డ్స్ కొల్లగొడుదామని ప్లాన్ చేసిన సినిమా ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇండియా వైడ్ ట్రెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.. కొత్తదనానికి మారుపేరయిన సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ మూడోసారి అనగానే అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్ మాస్ లుక్, ఎర్రచందనం చేసే స్మగ్లర్ గా, కాలికి ఆరు వేళ్ళు ఉండడం లాంటివి చూసాం. ఈ సినిమా చిత్తూరు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామా అని అందరికీ తెలిసిందే. సుకుమార్ ప్రతి సినిమాలో కన్నీరు పెట్టించే ఒక ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి సంబందించిన ఓ కీ పాయింట్ బయటకి వచ్చింది.

అదేమిటంటే ‘ చిన్నతనంలోనే అల్లు అర్జున్ తన ఫ్యామిలీ నుంచి విడిపోతాడట, ఆ తర్వాతే స్మగ్లర్ గా మారుతాడట. అలా చాలా డబ్బు సంపాదించాక తన ఫ్యామిలీకి తిరిగి దగ్గరవ్వడంతో ఎమోషనల్ టచ్ మొదలవుతుంది. కానీ అక్కడినుంచే కథ కొత్త మలుపులు తిరుగుతూ సుకుమార్ స్టైల్లో అందరినీ షాక్ కి గురిచేసేలా ట్విస్ట్ లతో కథని ముగిస్తాడట’. అల్లు అర్జున్ అభిమానులకి కావాల్సిన ఊర మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే సుకుమార్ స్టైల్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ పుష్కలంగా ఉండడంతో, పాన్ ఇండియా పరంగా అల్లు అర్జున్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ పక్కా అని టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.

మొత్తం 5 భాషల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పాన్ ఇండియా గుర్తింపు ఉన్న స్టార్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. బాలీవుడ్ పరంగా హిందీలో స్టార్ అయిన సునీల్ శెట్టితో విలన్ పాత్ర కోసం చర్చలు జరుపుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

గుడ్ న్యూస్: పోస్ట్ ప్రొడక్షన్ కి గ్రీన్ సిగ్నల్, షూటింగ్స్ పై త్వరలోనే నిర్ణయం.!

కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి...

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...

బర్త్ డే స్పెషల్: రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్దర్శకులుగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు, ఆయన సినిమాలకి తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. శతాధిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో అపురూపమైన సినిమాలను...

టిబి స్పెషల్: రంజాన్ రోజు ముస్లిం సోదరుల ఇంట నోరూరించే టాప్ 10 ఫుడ్స్

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఇదొక పర్వదినం.. వారి పండుగల్లో చాలా ప్రత్యేకమైనది.. నెల రోజుల ముందు నుంచే ఉపవాసం ఉంటూ, ప్రతి రోజూ నియమనిష్టలతో నమాజ్ చేస్తూ, ఎంతో పవిత్రంగా చేసుకునే...

వైసీపీ రంగుల పైత్యం.. ఈసారీ ‘సర్కారు’ పప్పులుడకలేదంతే.!

ఓ గ్రామంలో ఓ వంద ఇళ్ళు వున్నాయనుకుందాం.. అందులో 30 ఇళ్ళో 40 ఇళ్ళో వైసీపీ మద్దతుదారులవో వున్నాయనుకుందాం.. వాటికి వైసీపీ రంగులేసుకోవచ్చు కదా.? ప్రభుత్వ కార్యాలయాలకే వైసీపీ రంగులేయాలని వైఎస్‌ జగన్‌...