Switch to English

వైఎస్‌ జగన్‌ నయా ‘సిట్‌’.. ఎవరికోసం.? ఎందుకోసం.?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై ‘సిట్‌’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పదే పదే ఆరోపిస్తోన్న వైఎస్సార్సీపీ, ఆ ఆరోపణల్ని మరింత ముందుకు తీసుకెళ్ళే క్రమంలో, అదికారికంగా ప్రభుత్వం తరఫున ‘సిట్‌’ ఏర్పాటు చేసింది. ఈ ‘స్పెషల్‌ ఇన్వెస్టిగేటివ్‌ టీవ్‌ు’కి విశేష అధికారాల్ని కూడా కట్టబెట్టడం గమనార్హం.

చంద్రబాబు హయాంలో అవినీతికి సంబంధించి ఈ ‘సిట్‌’ విచారణ జరుపుతుంది. ఎవర్నయినా విచారణకు పిలిచే అధికారం ఈ ‘సిట్‌’కి వుంటుందట. అంటే, ఇక్కడ మేటర్‌ క్లియర్‌.. సరాసరి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిని కూడా ఈ ‘సిట్‌’ విచారణకు పిలిచే అవకాశముంది.. ఆయన మీద అనుమానమొస్తే. ఇందులో అనుమానం కొత్తగా రావడానికేముంది.? అసలు ప్రభుత్వ ఉద్దేశ్యమే అది.

మరోపక్క, ఈ ‘సిట్‌’ అర్థం పర్థంలేని వ్యవహారమని అంటూనే, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ‘సిట్‌’ని ఏర్పాటు చేశారంటూ టీడీపీ నేతలు గుస్సా అవుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో వుంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ‘సిట్‌’ నివేదికలు వుంటాయని గతంలో చాలా సంఘటనలు నిరూపించాయి. ఒకవేళ ప్రభుత్వానికి ‘సిట్‌’ నివేదికలు నచ్చకపోతే, అవి తొక్కిపెట్టబడ్తాయని కూడా గతంలో నిరూపితమయ్యింది. ఆ లెక్కన, ఇప్పుడు ఏర్పాటయిన ‘సిట్‌’, ప్రభుత్వంలో వున్న వైఎస్సార్సీపీ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నది నిర్వివాదాంశం.

అమరావతిలో అక్రమాలకు సంబంధించి గతంలో విచారణ షురూ అయ్యింది. ఏకంగా, ఈడీ రంగంలోకి దిగిందంటూ వైసీపీ ప్రచారం చేసింది. వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు విచ్చలవిడిగా కన్పించాయి. కానీ, చివరికి ఏం జరిగింది.? మళ్ళీ కొత్తగా ‘సిట్‌’ ఏర్పాటవుతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్యాప్తు సంస్థ సీబీఐ విషయంలోనే ‘పంజరంలోని చిలుక’ అనే విమర్శలున్నాయి. అలాంటిది, ‘సిట్‌’ గురించి, అందులో సీరియస్‌నెస్‌ గురించీ అంత సీరియస్‌గా ఆందోళన చెందే పరిస్థితి రాజకీయ పార్టీలకు వుంటుందా.? అన్నదే సర్వత్రా జరుగుతోన్న చర్చ.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...

ఎక్కువ చదివినవి

తాప్సీ ఇంట్లో విషాదం.. ఓదారుస్తున్న అభిమానులు.!

తెలుగు సినిమాల్లో తన గ్లామర్ తో నటనతో ఆకట్టుకున్న నటి తాప్పీ. పంజాబ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఝుమ్మంది నాదం సనిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవల తెలుగులో తన హవా...

హ్యాట్సాఫ్: వలస కూలీలకు ఫుడ్ సప్లై చేస్తున్న 99ఏళ్ల బామ్మ.!

లాక్ డౌన్ తో వ్యవస్థలన్నీ నిలిచిపోవడంతో ఎందరో కార్మికులకు పని లేకుండా పోయింది. వీరిలో ఎక్కువగా వలస కార్మికులే ఉన్నారు. వీరి ఉపాధికి కూడా గండి పడింది. దీంతో వీరంతా స్వస్థలాలకు బయలుదేరారు....

ఫైర్ యాక్సిడెంట్: సికింద్రాబాద్ లో బూడిదైన 10 గుడిసెలు.!

తెలంగాణ, సికింద్రాబాద్, బోయినపల్లిలోని బాపూజీ నగర్ లో గుడిసెల్లో రోజువారి కూలీలు నివాసం ఉంటారు. అక్కడ ఒక్క గుడిసెలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. అతి తక్కువ టైములో...

దూరదర్శిన్‌ ఉద్యోగికి కరోనా.. దిల్లీ స్టూడియో క్లోజ్‌.!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఈ సమయంలో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా దిల్లీలోని దూరదర్శిన్‌ కేంద్రంలో జాబ్‌...

టీటీడీ ఆస్తుల అమ్మకంపై బోర్డు కీలక నిర్ణయం

కొన్ని రోజుల క్రితం టీటీడీకి చెందిన ఆస్తులను అమ్మేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. బహిరంగ వేలంకు ప్రకటన రావడం.. భూముల వివరాలను కూడా ప్రకటించిన తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో...