Switch to English

మహేశ్ బర్త్ డే స్పెషల్: మహేశ్ కెరీర్.. ‘ప్రిన్స్ టు సూపర్ స్టార్’

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు సినిమాల్లో అడుగుపెట్టిన మహేశ్ తండ్రి వారసత్వం నిలబెట్టారు. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా నటనలో తానెంత చిచ్చరపిడుగో ఆనాడే నిరూపించారు. తండ్రితోనే కాకుండా సోలో హీరోగానూ నటించి మెప్పించారు. అశేషమైన సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు భవిష్యత్ ఆశాదీపంలా కనిపించారు. చదువు కోసం దశాబ్దం సినిమాలకు దూరమైనా తిరిగి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. 1999లో ప్రిన్స్ మహేశ్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆనతి కాలంలోనే సూపర్ స్టార్ మహేశ్ గా స్టార్ స్టేటస్ పొందారు. తన నటనలోని పదును సొంతంగా ఫ్యాన్స్ తెచ్చిపెడితే.. చార్మింగ్ లుక్స్ అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చింది. ఆగష్టు 9 మహేశ్ జన్మదినం సందర్భంగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

మహేశ్ బర్త్ డే స్పెషల్: మహేశ్ కెరీర్.. ‘ప్రిన్స్ టు సూపర్ స్టార్’

కొత్త తరహా కథలతోనే..

తండ్రి కృష్ణ సినిమాల్లో ప్రయోగాలు చేసినట్టే మహేశ్ కూడా ప్రయోగాలు చేశారు. బాబీ, నాని, 1నేనొక్కడినే సినిమాలతో తెలుగులో వినూత్న ప్రయోగాలు చేశారు. అయితే.. ఇవేమీ మహేశ్ కు సక్సెస్ ఇవ్వలేదు. దీంతో మహేశ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. తెలుగు సినిమాలకు యూఎస్ మార్కెట్ పెరగడం మహేశ్ సినిమాలతోనే ప్రారంభమైంది. పోకిరిలో మాస్, అతడులో క్లాస్, మురారి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో ఫ్యామిలీ, శ్రీమంతుడులో ఊరిని దత్తత తీసుకోవడం, భరత్ అను నేనులో పొలిటికల్.. ఇలా వివిధ జోనర్ సినిమాలు చేయడం మహేశ్ స్పెషాలిటీ. కెరీర్లో రీమేక్స్ జోలికి వెళ్లకపోవడం మహేశ్ ప్రత్యేకత. ఒకచోట చెప్పిన కథనే మళ్లీ చేయడం తనకు నచ్చదని కొత్త కథలే చేస్తానని అంటారు. సినిమా తర్వాత సినిమా చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూంటారు మహేశ్.

మహేశ్ బర్త్ డే స్పెషల్: మహేశ్ కెరీర్.. ‘ప్రిన్స్ టు సూపర్ స్టార్’

మహేశ్ ప్రత్యేకత అదే..

మహేశ్ తన కెరీర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్యామిలీకి అంతే సమయం కేటాయిస్తారు. సినిమా పూర్తయ్యాక ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లి భార్య, కుమారుడు, కుమార్తెతో ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేస్తారు. మహేశ్ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే పేద కుటుంబాల్లోని చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ తన పెద్ద మనసు చాటుకుంటారు. ఇవి మహేశ్ ను ఫ్యాన్స్, సినీ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేకంగా ఉంచుతుంది. నేడు మహేశ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని 135 స్క్రీన్స్ లో ‘పోకిరి’ సినిమాను ఫ్యాన్స్ స్వచ్ఛందంగా ప్రదర్శిస్తున్నారు. ఈ షోస్ ద్వారా వచ్చే మొత్తాన్ని మహేశ్ చేస్తున్న స్వచ్ఛంధ కార్యక్రమాలకే విరాళంగా ఇవ్వనున్నారు. మహేశ్ కెరీర్ మరింత దిగ్విజయంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు బర్త్ డే విశెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ తెలుగు: గీతూ రాయల్ ఓవరాక్షన్ వేరే లెవల్.!

‘ఆట రానోళ్ళు కూడా, ఆట గురించి మాట్లాడుతున్నారు..’ అంటూ చలాకీ చంటి మీద గీతూ రాయల్ నోరు పారేసుకుంది. కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన టాస్క్ సందర్భంగా...

పిక్ టాక్: ఎత్నిక్ వేర్ లో గ్లామర్ ఒలకబోస్తోన్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు యువతని కట్టిపడేస్తూ ఉంటుంది. కెరీర్ లో పదిహేనేళ్ళు పైగా పూర్తి చేసుకున్నా కానీ ఇంకా అవకాశాలకు...

ఎదురు చూపులకు తెర.. ‘ఆదిపురుష్’ వచ్చేశాడు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 2వ...

బిగ్‌ బాస్ 6 శ్రీ సత్య గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తెలుగు అమ్మాయి క్యూట్ ముద్దుగుమ్మ శ్రీ సత్య. హౌస్ లో...

కృష్ణంరాజు సంస్మరణ సభలో ప్రభాస్ చేయించిన వంటల లిస్ట్‌ ఇదిగో.. క్వింటాల్లో...

కృష్ణంరాజు మరణ వార్త ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఆయన మృతి చెందిన సమయంలోనే సొంత ఊరు మొగల్తూరు లో భారీ ఎత్తున సంస్మరణ సభ...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

బాలయ్య అన్ స్టాపబుల్ కు ఆ ఇద్దరూ వస్తారా?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాలయ్య నుండి ఆ రేంజ్ ఎనర్జీ లెవెల్స్ ఎవరూ ఊహించలేదు. ఆహాలో స్ట్రీమ్ అయిన అన్ స్టాపబుల్ సీజన్ 1 ఎంతటి సూపర్...

పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త: వైఎస్ జగన్‌కి ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరిక.!

‘మార్చెయ్యడానికీ, తీసెయ్యడానికీ ఎన్టీయార్ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగు జాతి వెన్నెముక..’ అంటూ సినీ నటుడు, టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ...

ప్రభాస్‌, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారా? కృష్ణంరాజు చనిపోయినప్పుడు ఏం జరిగింది?

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ అనుష్క ల మధ్య స్నేహం కాదు ప్రేమ ఉందని చాలా మంది బలంగా నమ్ముతారు. అది నిజం అవ్వాలని వారి అభిమానులు కూడా కోరుకుంటారు. కానీ పలు...

మహేష్ బాబుకి తల్లి అంటే అమితమైన ఇష్టంకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి ఇందిర దేవి మరణం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. మహేష్ బాబు తన తల్లి మరణం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న...

వైఎస్ జగన్.. చెల్లినీ మెప్పించలేకపోయినవ్.!

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో పేటెంట్ హక్కులు ముగ్గురికే వున్నాయ్. ఒకరేమో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇంకొకరు వైఎస్ విజయమ్మ.. మరొకరు వైఎస్ షర్మిల. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...